Site icon NTV Telugu

Kangana : హనీమూన్‌లో భర్తని చంపిన భార్య కేస్ పై.. రియాక్ట్ అయిన కంగనా రనౌత్..

Kangana Ranaut

Kangana Ranaut

మేఘాలయలో హనీమూన్ జంట మిస్సింగ్‌ కేసు దేశవ్యాప్తంగా కలకలం రేపింది. మధ్య ప్రదేశ్ లోని ఇండోర్‌కు చెందిన రాజా రఘువంశీ‌ని, అతని భార్య సోనమ్ తన ప్రియుడు‌తో కలిసి చంపిన సంఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో సోనమ్ రఘువంశీని పోలీసులు అరెస్ట్ చేసి. ఆమెను మేఘాలయకు తరలించి. అనంతరం పోలీసులు ఆమెను పాట్నాకు తరలించి అక్కడి పుల్వారీ పోలీస్ స్టేషన్లో ఉంచారు. ప్రజంట్ ఈ వార్త సోసల్ మీడియాలో కూడా ధుమారం లేపుతోంది. దీంతో తాజాగా ఈ వార్త పై బాలీవుడ్ క్వీన్ కంగనా ఇన్‌స్టా వేదికగా స్పందించింది..

Also Read : Papa Movie: తెలుగులో విడుదలకు సిద్దమైన ఎమోషనల్ మూవీ ‘పా..పా..’

‘రాజా రఘువంశీ హత్య కేసు నన్ను ఎంతగానో కదిలించింది. అసలు ఈ కేసుని అర్థం చేసుకోలేకపోతున్నాను. ఒక మహిళ తన తల్లిదండ్రులకు భయపడి వివాహాన్నే తిరస్కరించదు. అలాంటి మహిళ ఇంత క్రూరమైన హత్యకు పథకం వేసి సుపారీ ఇవ్వగలదా. ఉదయం నుంచి ఈ విషయం నా మనసును కలచివేస్తోంది. నన్ను కుదురుగా ఉండనివ్వడం లేదు. భర్త నుంచి విడాకులు తీసుకొని ప్రియుడుతో పారిపోకుండా ఎంత క్రూరమైన పని చేసింది. అందుకే మూర్ఖుల్ని ఎప్పుడూ తేలిగ్గా తీసుకోకూడదు. వారే సమాజానికి అత్యంత ప్రమాదకారులు. తెలివైన వ్యక్తులు తమ స్వార్థం కోసం ఇతరులకు ఇబ్బంది కలిగిస్తారేమో కానీ, తెలివితక్కువ వారు ఎలాంటి భయంకరమైన పనులకు పాల్పడతారో చెప్పలేం. దయచేసి అలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండండి’ అంటూ ఇనిస్టా లో పోస్ట్ చేసింది.

Exit mobile version