నేషనల్ క్రష్ రష్మికను స్పూర్తిగా తీసుకుని ఎంతో మంది ముద్దుగుమ్మలు సౌత్ ఇండస్ట్రీపై ఎటాక్ చేస్తున్నారు. ఇప్పటికే ఆషికా రంగనాథ్, రుక్మిణీ వసంత్, శ్రీనిధి శెట్టి, శ్రద్ధా శ్రీనాథ్ లాంటి కన్నడ కస్తూరీలు లక్ పరీక్షించుకున్నారు. వీరి జాబితాలోకి చేరింది కాంతార ఫేం సప్తమి గౌడ. నితిన్ తమ్ముడుతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది.కాంతారతో పాపులరైన సప్తమి గౌడ.. ఆ తర్వాత కూడా అలాంటి రోల్సే రావడంతో చూజీగా సినిమాలు ఎంచుకొంటోంది. ది వాక్సిన్ వార్ తో బాలీవుడ్‌లో లెగ్గెట్టిన ఈ చిన్నది అక్కడ హిట్ కొట్టింది.
Also Read : Prabhas : ఫిష్ వెంకట్ కు ప్రభాస్ సాయం.. ఫేక్ వార్తలపై క్లారిటీ ఇదే
ఇప్పుడు టాలీవుడ్ లో నితిన్ తమ్ముడుపై హోప్స్ పెట్టుకుంది సప్తమి గౌడ. ఇందులో చిన్న రోల్ అయినప్పటికీ ప్రముఖ నిర్మాణ సంస్థ దిల్ రాజు బ్యానర్ కావడంతో ఆ ఆఫర్ కాదనలేకపోయింది. భారీ అంచనాల మధ్య వచ్చిన తమ్ముడు ప్లాప్ టాక్ తెచ్చుకుంది. మొదటి రోజు మొదటి ఆట నుండి నెగిటివ్ టాక్ వచ్చింది. ఆ సంగతి అలా ఉంచితే సప్తమీగౌడ పాత్ర ఆడియెన్స్ ను చిరాకు పెట్టించింది అనే కామెంట్స్ వచ్చాయి. అటు సినిమా ప్లాప్ అయి ఇటు తన పాత్ర పట్ల నెగిటివ్ టాక్ రావడంతో తెలుగులో స్టార్ హీరోయిన్ అవ్వాలనుకున్న ఈ కన్నడ భామకు జలక్ తగిలింది. ప్రస్తుతం సప్తమి తమిళం, కన్నడతో పాటు హిందీలో థామా మూవిలో కనిపించబోతోంది. ఆయుష్మాన్ ఖురానా, రష్మిక జంటగా నటిస్తున్నారు. ఇందులో కీ రోల్ చేస్తోంది సప్తమి. మరి తెలుగులో రాణించాలి అనుకున్న సప్తమికి నెక్ట్స్ అఫర్ ఎవరు ఇస్తారో హిట్ ఎప్పుడు వస్తుందో చూడాలి.
