NTV Telugu Site icon

KamalHaasan : ఒకటి థియేటర్లో ఉండగానే మరోటి ముగించిన కమల్ హాసన్

Untitled Design (5)

Untitled Design (5)

కమల్ హాసన్ 69ఏళ్ల వయసులో కుర్ర హీరోలతో సమానంగా పని చేస్తున్నాడు. ఇటీవల కల్కిలో ప్రతినాయుకునిగా అద్భుతంగా నటించి మెప్పించారు. మరో వైపు కమల్ హాసన్ హీరోగా నటించిన భారతీయుడు -2 ఇటీవల విడుదలై ఫ్లాప్ గా మిగిలింది. ఇదిలా ఉండగా కమల్ వరుస సినిమాలతో జెట్ స్పీడ్ లో దూసుకెళ్తున్నారు.

కమల్ హాసన్ హీరోగా ‘తగ్ లైఫ్’ అనే చిత్రం రాబోతున్న సంగతి తెలిసిందే. మనిరత్నం ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. పాన్ ఇండియా సినిమాగా ఈ చిత్రం రాబోతోంది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ చివరి దశకుచేరుకున్నట్టు తమిళ సినీ వర్గాల సమాచారం. ఈ సినిమాకు సంబంధించి కేవలం 25 రోజుల షూటింగ్ మాత్రమే పెండింగ్‌లో ఉందని యూనిట్ తెలిపింది. ఈ చిత్రంలో కమల్ హాసన్ తో పాటు తమిళ్ స్టార్ హీరో శింబు, జయం రవి, గౌతమ్ కార్తీక్, త్రిష, ఐశ్వర్య లక్ష్మి తో పాటు మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, జోజో జార్జ్ ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. కమల్ లేటెస్ట్ భారతీయుడు -2 యొక్క 2 వారాల పూర్తి స్థాయి ప్రమోషన్లు ముగించిన తర్వాత తగ్ లైఫ్ షూటింగ్ లో పాల్గొన్నారని, ఆగస్టు నెలాఖరుకు టోటల్ షూట్ కంప్లీట్ చేసి రిలీజ్ చేసేందుకు నిర్మాణ సంస్థ తెలిపింది.

మరోవైపు భారతీయుడు -2కు థియేటర్లలో ఉంది, దీనికి  సిక్వెల్  రాబోతుందని శంకర్ ఇదివరకే  ప్రకటిచాడు. మరి భారతీయుడు-2 డిజాస్టర్ కారణంగా సిక్వెల్  ఎప్పటినుండి మొదలు పెడతారన్న అనుమానం అందరిలో ఉంది. వీటితో పాటు కల్కి పార్ట్ -2లో కమల్ హాసన్ కీలక పాత్ర పోషిస్తున్నారు.

Also Read : MATKA: రామోజీ ఫిల్మ్ సిటీలో ముగించిన ‘మట్కా’..నెక్స్ట్ ఎక్కడంటే..?

Show comments