Site icon NTV Telugu

Kamal Haasan : నాకు మళ్ళీ మంచి సక్సెస్ ఇచ్చినందుకు థాంక్స్

Kamal-Haasan

విశ్వనటుడు కమల హాసన్‌ నటించిన ‘విక్రమ్‌’ చిత్రం బ్లాక్‌బస్టర్‌ హిట్‌ సాధించింది. దీంతో నేడు థ్యాంక్స్‌ మీట్‌ నిర్వహించారు. ఇందులో కమల్‌ హాసన్‌, దర్శకుడు లోకేష్‌ కనకరాజ్‌, హీరో రానా, నిర్మాత సుధాకర్ రెడ్డి పాల్గొన్నారు. నిర్మాత సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ.. విక్రమ్ సినిమా అన్ని సినిమాలను క్రాస్ చేసి హయ్యస్ట్ రేంజ్ లోకి వెళ్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కమల్ హాసన్ కెరీర్ లో పెద్ద హిట్ ఎక్కువ గ్రాసర్ అవుతుందని ఆయన వ్యాఖ్యానించారు. అనంతరం రానా మాట్లాడుతూ రీసెంట్ టైం లో ఓకే రోజు రెండు భాషల్లో చూసిన సినిమా విక్రమ్ అని, లోకేష్ కనకరాజు కమల్ హాసన్ గారిని బాగా హ్యాండిల్ చేశాడన్నారు. కమల్ హాసన్ గారికి కంగ్రాట్స్ సార్’ అని రానా అన్నారు.

ఆ తరువాత దర్శకుడు లోకేష్ కనకరాజు మాట్లాడుతూ.. తెలుగు ఆడియన్స్ కి నా బిగ్ థాంక్స్ అని కృతజ్ఞతలు తెలిపారు. కమల్ హాసన్ మాట్లాడుతూ.. నేను లోకేష్ కనకరాజు ఖైదీ సినిమా చూసాను .విక్రమ్ బాగా చేసాడు. రానా నా పిక్చర్స్ కి వచ్చి అవి ఆడకపోయినా సపోర్ట్ చేశారు. రానా మా ఫ్యామిలీ. నాకు మళ్ళీ మంచి సక్సెస్ ఇచ్చినందుకు థాంక్స్. మరో చరిత్ర ఒక స్టార్ డం తీసుకొచ్చింది.. సినిమా ప్రపంచ భాష. నెక్స్ట్ నా సినిమా మీరు మరింత మెచ్చేలా వుంటుంది. మంచి ఎఫార్డ్స్ వున్న సినిమాని ప్రేక్షకులు ఎంకరేజ్ చేయాలి అని ఆయన అన్నారు.

Exit mobile version