NTV Telugu Site icon

Kamal Haasan: వరుస కాల్స్ వస్తున్నాయి.. ఇలా అవుతుందని అనుకోలేదు.. వీడియో రిలీజ్ చేసిన కమల్

Kamal Haasan

Kamal Haasan

Kamal Haasan Releases a Video about Kalki 2898 AD Movie: భారతీయుడు 2 సినిమాకి మిక్స్డ్ టాక్, డిజాస్టర్ కలెక్షన్స్ గురించి చర్చ జరుగుతున్న సమయంలో ఆ సినిమా హీరో కమల్ హాసన్ ఒక వీడియో రిలీజ్ చేశారు. అయితే అయన వీడియో రిలీజ్ చేసింది భారతీయుడు 2 సినిమా గురించి కాదు. ఆయన నటించిన మరో సినిమా ‘కల్కి 2898 AD’ గురించి. ‘కల్కి 2898 AD’లో యాస్కిన్ పాత్రకు అన్ని వర్గాల నుంచి సానుకూల స్పందన లభించింది. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇప్పటివరకు దాదాపు 1050 కోట్ల రూపాయలను రాబట్టి ఆల్ టైమ్ అత్యధిక వసూళ్లు చేసిన ఐదో భారతీయ చిత్రంగా నిలిచింది. ఈ క్రమ్మలో కమల్ ఈరోజు ఓ ప్రత్యేక వీడియోను విడుదల చేసి కల్కి భారీ విజయంపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఆయన మాట్లాడుతూ, వరుస ఫోన్లు వస్తున్నాయి. కెరీర్లో దాదాపు 250 సినిమాలు చేశాను. కానీ ఇది చాలా స్పెషల్. ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అవుతుందని అనుకోలేదు. ‘కల్కి సినిమా పెద్ద హిట్‌. కలెక్షన్లు పెరుగుతున్నాయి. ఇది సంతోషకరమైన క్షణం. దాదాపు 250 సినిమాలు చేశాను కానీ అందులో కొన్ని అంతగా ఆకట్టుకోలేదు అని అన్నారు.

Anant Ambani’s Wedding: అనంత్ అంబానీ-రాధిక పెళ్లి సమయంలో బాంబు బెదిరింపు.. ఇంజనీర్‌ అరెస్ట్

ఇక యాస్కిన్ పాత్రను ఎలా డిజైన్ చేశారనే దాని గురించి కమల్ మాట్లాడుతూ, ‘మేము కలిసి ఈ యాస్కిన్‌ని రూపొందించాము. నాగ్ అశ్విన్ రూపొందించాడు. అతను ఉలితో వచ్చాడు, నేను సుత్తితో వచ్చాను. మేము ఒక సుత్తితో ఆకారాన్ని తయారు చేసాము, తరువాత కాల్చామని అన్నారు. ఇక తన షార్ట్ స్క్రీన్ టైమ్ గురించి కమల్ మాట్లాడుతూ.. ‘నేను ఈ సినిమాలో తక్కువ వ్యవధి మాత్రమే ఉన్నానని అన్నారు. యాస్కిన్ గెటప్ చూశా, నాకు రాత్రిళ్ళు కూడా భయం కలిగేలా ఆ డిజైన్ ఉంది. ‘ఈ సినిమా చేయడానికి భారతదేశంలోని కొంతమంది పెద్ద స్టార్స్ కలిసి వచ్చారు. నాగ్ అశ్విన్‌కు ఊహించే శక్తి ఉన్న చిన్నతనం ఉంది, దీనిని ప్రోత్సహించాలి. మీరు పార్ట్ 2లో యాస్కిన్ ను మరింతగా చూస్తారని అన్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను వైజయంతీ మూవీస్ నిర్మించిన భారతదేశంలోని అత్యంత ఖరీదైన చిత్రం. ఈ చిత్రానికి డైలాగ్స్‌ని సాయి మాధవ్ బుర్రా రాశారు.’కల్కి 2898 AD’లో ప్రభాస్‌తో పాటు కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె, దిశా పటానీ మరియు పలువురు ఇతర నటీనటులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

Show comments