Site icon NTV Telugu

Kamal Haasan : ‘థగ్ లైఫ్’ నుంచి ఫస్ట్ సింగిల్‌ రిలీజ్ డెట్ ఫిక్స్..

Teja Sajja,'mirai',daggubati Rana,

Teja Sajja,'mirai',daggubati Rana,

యూనివర్సల్ స్టార్ హీరో కమల్ హాసన్ నటిస్తున్న తాజా చిత్రం ‘థగ్ లైఫ్’. తమిళ లెజెండరీ దర్శకుడు మణిరత్నం తెరకెక్కిస్తున్న ఈ మూవీ కోసం వరల్డ్‌వైడ్‌గా  ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ‘నాయకన్’ తర్వాత దాదాపు 37 ఏళ్లకు మళ్లీ ఈ ఇద్దరూ కలసి ‘థగ్ లైఫ్’ కోసం పని చేస్తున్నారు. కాగా ఈ సినిమాలో  కమల్ రంగరాజ్ శక్తివేల్ నాయకర్ అనే గజదొంగ పాత్రలో కనిపించబోతున్నారట. ఇక శింబు, త్రిష, అశోక్ సెల్వన్, ఐశ్వర్య లక్ష్మీ, జోజు జార్జ్, అభిరామి, నాజర్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తుండగా, రాజ్ కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్, మద్రాస్ టాకీస్, రెడ్ జి యాంట్ మూవీస్ బ్యానర్లు ఈ చిత్రాన్ని సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నాయి. అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్నఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామా కు ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా. ఈ చిత్రం జూన్ 5న విడుదల కానుంది. అయితే తాజాగా ఈ మూవీకు సంబంధించిన ఓ సాలిడ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్..

ఏంటీ అంటే.. ‘థగ్ లైఫ్’ చిత్రంలోని ఫస్ట్ సింగిల్ సాంగ్ ‘జింగుచా’ను ఏప్రిల్ 18న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ మూవీతో మణిరత్నం, ఏ ఆర్ రెహమాన్ కాంబో పై మరోసారి భారీ హైప్ క్రియేట్ అయింది. ఎందుకంటే వీరిద్దరి కలయికలో వచ్చిన చాలా సినిమాలు సూపర్ హిట్ అందుకున్నాయి. అందుకే ఈ ఫస్ట్ సాంగ్ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

 

Exit mobile version