Kalyanam Kamaneeyam Jeevitham: ప్రేమ, సస్పెన్స్ లతో ‘కళ్యాణం కమనీయం జీవితం’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్లో వినూత్నమైన కథలతో, సరికొత్త కాన్సెప్ట్‌లతో వచ్చే చిత్రాలకు ఆడియన్స్ ఎప్పుడూ బ్రహ్మరథం పడతారు. అదే బాటలో, ప్రేమ మరియు సస్పెన్స్ ఎలిమెంట్స్‌తో ఒక ఉత్కంఠభరితమైన సైకో-రోమాంటిక్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న చిత్రం “కళ్యాణం కమనీయం జీవితం”. ‘వివిఫై మీడియా ఫిల్మ్ ఫ్యాక్టరీ’పై ఖాన్ దురాని, సాహితి ఆవంచ లీడ్ రోల్స్‌లో.. డైరెక్టర్ రవి లోకిరెడ్డి దర్శకత్వంలో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. పైలా ప్రసాద్ రావు, కిషోర్ గుండాల సంయుక్తంగా ఈ చిత్రాన్ని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు. తాజాగా ఈ సినిమా అఫీషియల్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను టాలీవుడ్ లెజెండరీ రైటర్, విజయేంద్ర ప్రసాద్ గ్రాండ్‌గా ఆవిష్కరించి చిత్ర యూనిట్‌కు తన బ్లెస్సింగ్స్ అందించారు.
పోస్టర్ లాంచ్ చేసిన అనంతరం ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. “ఈ సినిమా టైటిల్ చాలా బాగుంది. డిస్ట్రిబ్యూటర్ రాజవంశీ నాకు ఈ టైటిల్ గురించి చెప్పగానే నేను చాలా ఇంప్రెస్ అయ్యాను. పోస్టర్ చూస్తుంటేనే దర్శకుడి విజన్ ఏంటో క్లియర్ గా అర్థమవుతోంది. నిర్మాతలు ఒక మంచి ప్రయత్నం చేశారు. చిత్ర యూనిట్ మొత్తానికి నా ఆల్ ది బెస్ట్” అని కొనియాడారు. దర్శకుడు రవి లోకిరెడ్డి మాట్లాడుతూ.. “మహామహుడు విజయేంద్ర ప్రసాద్ మా చిత్ర పోస్టర్‌ను రిలీజ్ చేయడంతోనే సగం సక్సెస్ సాధించినంత హ్యాపీగా ఉంది. నా కథను నమ్మి నాకు పూర్తి ఫ్రీడమ్ ఇచ్చిన ప్రొడ్యూసర్లకు థాంక్స్. ఇదొక ప్యూర్ లవ్ స్టోరీలా కనిపిస్తూనే.. ఊహించని సస్పెన్స్ ఎలిమెంట్స్‌తో ఆడియన్స్‌కు ఒక అద్భుతమైన ఉత్కంఠభరితమైన రైడ్‌ను అందిస్తుంది. మా టీమ్ అంతా ప్రాణం పెట్టి పనిచేశాం” అని వెల్లడించారు.
Also Read
తాజావార్తలు
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
EPIC : ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అవుతున్న ‘ఎపిక్’.. ఎప్పుడు ఎక్కడ చూడాలంటే?
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
HSLలో కొత్త చరిత్ర.. ఫ్లీట్ సపోర్ట్ షిప్ ‘సూర్య’ జలప్రవేశం.. రాజ్‌నాథ్ సింగ్ ప్రశంసలు
ట్రెండింగ్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!