Site icon NTV Telugu

Mario : బక్క చిక్కిన హెబ్బా.. నవంబర్లో ‘మారియో’ రిలీజ్

Mario

Mario

‘నాటకం’, ‘తీస్ మార్ ఖాన్’ వంటి విభిన్న చిత్రాలతో దర్శకుడిగ మంచి గుర్తింపు తెచ్చుకున్న కళ్యాణ్ జీ గోగణ, ఇప్పుడు ‘మారియో’ చిత్రంతో ప్రేక్షకులను మెప్పించేందుకు సిద్ధమవుతున్నారు. అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్‌గా, కంటెంట్ ఓరియెంటెడ్ కమర్షియల్ జానర్‌లో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన పోస్టర్లు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. రీసెంట్‌గా ‘ఎ టర్బో-చార్జ్డ్ ర్యాంప్ రైడ్’ అనే ట్యాగ్‌లైన్‌తో హీరో అనిరుధ్, హీరోయిన్ హెబ్బా పటేల్ ఉన్న పోస్టర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ఇది సినిమాపై అంచనాలను మరింత పెంచింది.

ప్రస్తుతం ఈ మూవీ టీం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. అన్ని కార్యక్రమాలను వేగంగా పూర్తి చేసి, నవంబర్‌లో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్లు ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుత ట్రెండ్‌కు తగ్గట్టుగా, సినిమా ఆద్యంతం వినోదాత్మకంగా ఉంటుందని చిత్రబృందం తెలుపుతోంది. ఈ ‘మారియో’ చిత్రాన్ని సిల్వర్ స్క్రీన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మిస్తుండగా, రిజ్వాన్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ సహ నిర్మాతలుగా వ్యవహరిస్తోంది. ఈ చిత్రానికి సాయి కార్తీక్ మరియు రాకేందు మౌళి సంగీతాన్ని అందిస్తున్నారు. పాటలు, మాటలను రాకేందు మౌళి సమకూర్చారు. అంతేకాకుండా, కథ మరియు సంభాషణల అభివృద్ధిలో కూడా రాకేందు మౌళి దర్శకుడు గోగణకు మద్దతుగా నిలిచారు. సాంకేతిక నిపుణుల విషయానికొస్తే, MN రెడ్డి సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహిస్తుండగా, మణికాంత్ మరియు మదీ మన్నెపల్లి ఎడిటర్లుగా పనిచేస్తున్నారు.

Exit mobile version