Site icon NTV Telugu

Kalpika : సినీ నటి కల్పిక‌పై మరో కేసు నమోదు

Kalpika Ganesh Latest News

Kalpika Ganesh Latest News

ప్రముఖ సినీ నటి కల్పిక గణేష్ మీద రోజుకో వార్త పుట్టుకోస్తోంది. తాజాగా ఆమె పై మరో కేసు నమోదయింది. అసలు విషయంలోకి వెళితే.. ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో అసభ్యకరమైన పదజాలం ఉపయోగించి తనను దూషించింది అంటూ బాధితురాలు కీర్తన పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చింది. ఆన్లైన్ అబ్యూజింగ్ తో పాటు వేధింపులకు కూడా పాల్పడినట్లు ఆమె తన ఫిర్యాదులో తెలిపింది. ఇక సోషల్ మీడియాలో స్టేటస్ పెట్టుకోవడం‌తో పాటు, బాధితురాలికి మెసేజ్ పెట్టి కల్పిక చాలా వల్గర్‌గా మాట్లాడిందట.

Also Read : Kubera: ‘కుబేరా’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు.. కొత్త డేట్ లాక్ !

ఇన్ బాక్స్ మెసేజ్లను, స్టేటస్ పెట్టిన స్క్రీన్ షాట్‌లను పోలీసులకు బాధితురాలు కీర్తన చూపించింది. దీంతో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు రంగంలోకి దిగి 67 ITA 2000-2008,79,356 BNS ప్రకారంగా కేసు నమోదు చేసుకున్నారు. ప్రస్తుతం ఈ విషయం వైరల్ కావడంతో ఇక కల్పిక బయటికి రావడం కష్టమే అంటూ కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.

Exit mobile version