NTV Telugu Site icon

Kalki 2898 AD: ఇంకా కల్కి చూడని వారికి గుడ్ న్యూస్

Kalki 2898 Ad Boxoffice Collections

Kalki 2898 Ad Boxoffice Collections

Kalki 2898 AD Team Announces Ticket Prise: ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన “కల్కి 2898 ఏడీ” సినిమా ఎంత పెద్ద హిట్గా నిలిచిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జూన్ 27వ తేదీన రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించింది. ఈ సినిమాలో ప్రభాస్ తో పాటు కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే, దిశా పటాని, రాజేంద్రప్రసాద్, అన్నా బెన్, శోభన వంటి వాళ్ళు కీలక పాత్రల్లో నటించారు. సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి అనేక ప్రాంతాల్లో కలెక్షన్ల రికార్డులు సృష్టిస్తూ దూసుకుపోతోంది. ఇప్పటికే 1200 కోట్ల కలెక్షన్లు రాబట్టిన ఈ సినిమా తదుపరి మైల్ స్టోన్ దిశగా పరుగులు పెడుతోంది. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే సినిమా రిలీజ్ అయ్యి ఇప్పటికే దాదాపు 5 వారాల వరకు పూర్తవుతుంది.

Also Read: Allu Sirish: సక్సెస్ పార్టీ చేసుకోవాలని అనుకున్నా కుదరలేదు.. అల్లు శిరీష్ ఆసక్తికర కామెంట్స్

అయినా సరే చాలా చోట్ల ఇప్పటికీ హౌస్ ఫుల్స్ నమోదు అవుతున్నాయి. ఇక తాజాగా ఈ సినిమాకి సంబంధించి టికెట్ ప్రైజ్ గురించి సినిమా యూనిట్ ఒక అప్డేట్ రిలీజ్ చేశారు మేకర్స్. ఎపిక్ మహా బ్లాక్‌బస్టర్ గ ఘన విజయం అందించిన “కల్కి 2898 ఏడీ”ని కేవలం రూ.100కే ఆస్వాదించండి. భారతదేశం అంతటా సినిమా థియేటర్లలో 100/-, ఆగస్ట్ 2 నుండి ఒక వారం పాటు అందుబాటులో ఉంటుందని వెల్లడించింది. కాబట్టి ఈ సినిమాని సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ కోసం థియేటర్లలోనే చూడాల్సిందిగా సినిమా యూనిట్ చెబుతోంది. సుమారు 700 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమాని వైజయంతి మూవీస్ బ్యానర్ మీద అశ్వినీ దత్ తన కుమార్తెలు స్వప్న, ప్రియాంకలతో కలిసి నిర్మించారు.

Show comments