Kalki 2898 AD Grosses Massive 191.50 Crores Worldwide On Day One: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన తాజా చిత్రం కల్కి 2898 AD గురువారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఫస్ట్ షో నుంచి అన్నిచోట్ల ఫుల్ పాజిటివ్ టాక్ తో దూసుకుపోతన్న ఈ సినిమా కలెక్షన్స్ లెక్కలు బయటకొచ్చాయి. ఈ మేరకు సినిమా యూనిట్ ఒక అధికారిక పోస్టర్ రిలీజ్ చేసింది. ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాను దూరదృష్టి కలిగిన డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించాడు. అటు విమర్శకులతో పాటు ప్రేక్షకుల నుండి పాజిటివ్ రివ్యూస్ పొందిన ఈ చిత్రం మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 191.50 కోట్ల భారీ వసూళ్లు సాధించింది. ఈ ఏడాది అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా కల్కి రికార్డు క్రియేట్ చేసింది. నిజానికి కల్కి 2898 AD గురువారం (సెలవు లేని రోజు) విడుదలైంది, అయినప్పటికీ ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఈ రేంజ్ కలెక్షన్స్ సాదించడం ఓ రికార్డుగానే చెప్పాలి. ఇక ఏరియా వైజ్ కలెక్షన్స్ పరిశీలిస్తే తెలుగు రాష్ట్రాల్లో 72 కోట్లు, నార్త్ అమెరికా 52 కోట్లు. యూరోప్ 4 కోట్లు, యూకే 5 కోట్లు, మిడిల్ ఈస్ట్ 10.5O కోట్లు, కర్ణాటక 10 కోట్లు, తమిళనాడు 6 కోట్లు, కేరళ 4 కోట్లు, నార్త్ ఇండియా హిందీ బెల్ట్ 28 కోట్లు మొత్తం కలిపి 191.50 కోట్లు.
Prabhas : ఇండస్ట్రీలో రేర్ రికార్డు క్రియేట్ చేసిన ప్రభాస్
హిందీ వెర్షన్‌తో పాటు 2024లో అత్యధిక వసూళ్లు చేసిన ఓపెనర్‌గా నిలిచింది. నాలుగు రోజుల లాంగ్ వీకెండ్‌లో, వైజయంతీ మూవీస్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కల్కి 2898 AD రూ. 500 కోట్ల బెంచ్‌మార్క్‌ను తాకుతుందని అంచనా వేస్తున్నారు. మరీ ముఖ్యంగా శనివారం జరగనున్న వరల్డ్ కప్ ఫైనల్ తో సినిమాకు మరో ముప్పు ఉన్నా 500 కోట్ల మార్క్ ఈజీ అనే అంటున్నారు. ఈ చిత్రంలో దీపికా పదుకొనే, దిశా పటానీ, విజయ్ దేవరకొండ మరియు దుల్కర్ సల్మాన్ వంటి నటులు ప్రత్యేక పాత్రలలో నటించారు. మహాభారతానికి, కలియుగాంతానికి లింక్ పెట్టి డైరెక్టర్ నాగ్ అశ్విన్ అదిరిపోయే మూవీ తీశారని ప్రేక్షకులు అంటున్నారు. ఇప్పటివరకు తెలుగులో మొదటిరోజు అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా ఆర్ఆర్ఆర్ సినిమా రూ. 223 కోట్లతో మొదటి స్థానంలో, బాహుబలి 2 రూ. 217 కోట్లతో రెండో స్థానంలో నిలవగా కల్కి సినిమా మూడో ప్లేస్ లో నిలిచింది.