Kalki 2898 AD Grosses 680 Crores Worldwide In 6 Days: కల్కి 2898 AD గత నెల 27న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా విడుదలైన మొదటి ఆట నుంచే మంచి పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇక కలెక్షన్స్ విషయంలో కూడా ఈ సినిమా ఎక్కడా తగ్గడం లేదు. బాక్సాఫీస్ కలెక్షన్లను బద్దలు కొడుతూ చరిత్రను సృష్టిస్తున్న ప్రభాస్ – నాగ్ అశ్విన్‌ల మైథాలజీ సైన్స్ ఫిక్షన్ కల్కి 2898 AD మరింత ముందుకు దూసుకుపోతింది. 700 కోట్ల మార్క్ చేరుకున్న ఈ సినిమా ఇప్పుడు 1000 కోట్ల మార్క్ దిశగా దూసుకుపోతోంది. ఇక కల్కి 2898 AD మంగళవారం నాడు 55 కోట్లకు పైగా గ్రాస్‌తో ఆరు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.680 కోట్లుకు పైగా రాబట్టింది.
Jani Master: అండగా నిలబడతామన్నారు.. మెగా కుటుంబంపై జానీ మాస్టర్ ట్వీట్
ఇక అన్ని భాషల్లోనూ ఈ సినిమా వారం రోజుల్లో మంచి వసూళ్లను రాబడుతోంది. అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె, కమల్ హాసన్ ఇతర కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా ఒక్క ఉత్తర భారతదేశంలో 150 కోట్లకు పైగా వసూలు చేసింది. ఉత్తర అమెరికాలో, కల్కి 2898 AD 12.75 మిలియన్ డాలర్లు కలెక్ట్ చేసి మరిన్ని వసూళ్ల దిశగా దూసుకుపోతోంది. వైజయంతీ మూవీస్ నిర్మించిన ఈ సినిమా ఈ వారాంతంలో వెయ్యి కోట్ల మార్క్ చేరినా ఆశ్చర్యం లేదు. మరే సినిమా పోటీలో లేకపోవడంతో పాటు పెంచిన టికెట్ ధరలు తగ్గడంతో ఇంకా చూడని వారు ఉంటే చూసే అవకాశంతో పాటుగా రిపీట్ ఆడియన్స్ కూడా నమోదయ్యే అవకాశం ఉంది.