NTV Telugu Site icon

Kalki 2898: కల్కి -2.. రెబల్ స్టార్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్

Kalki

Kalki

బాహుబలి 2 తర్వాత ప్రభాస్‌కు వెయ్యి కోట్లు ఇచ్చిన సినిమాగా కల్కి 2898 ఏడి నిలిచింది. బాక్సాఫీస్ దగ్గర ఏకంగా రూ. 1200 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. ఇక ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కల్కి 2 కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు రెబల్ స్టార్ ఫ్యాన్స్. ఖచ్చితంగా ఈ సీక్వెల్  ఊహించినదానికంటే మించి ఉంటుందనే నమ్మకంతో ఉన్నారు. దర్శకుడు నాగ్ అశ్విన్ కూడా ప్రభాస్‌ క్యారెక్టర్‌ ఉహకందనంత విధంగా ఉంటుందని చెబుతు వస్తున్నాడు. అయితే ఈ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుంది, ఎప్పుడు రిలీజ్ అవుతుందనే విషయంలో క్లారిటీ లేదు.

Also Read : NBK 111 : బాలయ్య – అనిరుధ్.. థియేటర్లు బ్లాస్టింగే

కానీ వైజయంతీ మూవీస్ మాత్రం వీలైనంత త్వరగా కల్కి 2ని పూర్తి చేసే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే ప్రభాస్ ఇప్పటికే రాజాసాబ్, ఫౌజీ సినిమాలు చేస్తున్నాడు. సందీప్ రెడ్డి వగం ‘స్పిరిట్’ కూడా లైన్లో ఉంది. కాబట్టి కల్కి 2 ఇప్పట్లో ఉండే ఛాన్స్ లేదనుకున్నారు. కానీ లేటెస్ట్ అప్డేట్ ప్రకారం జూన్‌ నుంచి ‘కల్కి 2’ షూటింగ్‌ను స్టార్ట్ చేయనున్నట్టుగా తెలుస్తోంది. ఫస్ట్ షెడ్యూల్‌లో ప్రభాస్‌తో పాటు కీలక పాత్రలపై కొన్ని ముఖ్య సన్నివేశాలను తెరకెక్కించనున్నారట. ఇప్పటికే ఫస్ట్ పార్ట్ షూటింగ్‌ సమయంలోనే సీక్వెల్‌కు సంబంధించి కొంత షూటింగ్ చేసి పెట్టుకున్నారు. ఇటీవల నిర్మాత అశ్వనీదత్‌ కూడా కల్కి సెకండ్ పార్ట్‌ 25 శాతం షూటింగ్‌ పూర్తయిందని తెలిపారు. కాబట్టి వచ్చే ఏడాదిలో కల్కి 2 ఖచ్చితంగా రిలీజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. కానీ షూటింగ్ ఎప్పుడనే విషయంలో మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మరి కల్కి 2 ఎలా ఉండబోతుందో చూడాలి.