NTV Telugu Site icon

Kalinga : తన చెవిని తానే కోసుకుని తినేస్తున్న అమ్మాయి.. వామ్మో ఇదేం టీజర్ అయ్యా?

Kalinga Teaser

Kalinga Teaser

Kalinga Movie Teaser Launched: కిరోసిన్ హిట్‌తో పేరు తెచ్చుకున్న ధృవ వాయు మరోసారి సరి కొత్త కాన్సెప్ట్ బేస్డ్ చిత్రం ‘కళింగ’తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నాడు. ఈ సినిమాలో ధ్రువ ప్రధాన పాత్రలో నటించడమే కాకుండా ఈ ప్రాజెక్టుకు దర్శకత్వం కూడా చేస్తున్నాడు. బిగ్ హిట్ ప్రొడక్షన్స్ పతాకంపై దీప్తి కొండవీటి, పృథ్వీ యాదవ్ నిర్మిస్తున్న ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ ఇటీవలే విడుదలై మంచి రెస్పాన్స్‌ను దక్కించుకోగా తాజాగా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. బాలీవుడ్ స్టార్ జాకీ ష్రాఫ్ టీజర్‌ను విడుదల చేసి టీంను అభినందించారు. ఇక ఈ టీజర్ ప్రారంభంలోనే ఒక అమ్మాయి తన చెవిని తానే కోసుకుని తినే సీన్ ఒళ్లు గగుర్పొడిచేలా షాట్ కట్ చేశారు. సస్పెన్స్, థ్రిల్లింగ్ కాన్సెప్ట్‌తో రాబోతోన్న కళింగ టీజర్ అందరినీ ఆకట్టుకునేలా ఉంది. ప్రస్తుతం ఉన్న ట్రెండ్‌కు తగ్గట్టుగా, గ్రిప్పింగ్ కథనంతో అందరినీ మెప్పించేలా ఈ చిత్రం రాబోతోందని అర్థం అవుతోంది.

Vishnu Priya: రీతూ జీవితంలోకి వచ్చాక పొట్ట పెరిగింది.. విష్ణు ప్రియా ఆసక్తికర వ్యాఖ్యలు

కళింగ టీజర్‌లో అన్ని రకాల అంశాలను జోడించారు మేకర్స్. యాక్షన్, ఎమోషన్, రొమాన్స్, సస్పెన్స్, థ్రిల్లింగ్ అంశాలను చూపించేలా కట్ చేసిన టీజర్ అందరిలోనూ ఆసక్తిని పెంచేసింది. ఇక ఈ టీజర్ చూస్తుంటేనే ప్రేక్షకులను భయపెట్టేలా ఉందని మాత్రం చెప్పొచ్చు. సంస్థానం అనేది పెద్ద పద్మవ్యూహం.. అక్కడికి పోవడమే కానీ తిరిగి రావడం ఉండదు.. అంటూ సాగుతున్న డైలాగ్స్ ధృవ వాయు యాక్టింగ్, స్క్రీన్ ప్రజెన్స్.. విజువల్స్, ఆర్ఆర్ ఈ టీజర్లో ప్రత్యేకంగా హైలెట్ అవుతున్నాయి. ఇక ఈ సినిమాలో ప్రగ్యా నయన్ కథానాయికగా నటిస్తుండగా, ఆడుకాలం నరేన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. అక్షయ్ రామ్ పొడిశెట్టి సినిమాటోగ్రఫీ.. విష్ణు శేఖర, అనంత నారాయణన్ AG సంగీతం ప్రధాన ఆకర్షణ కానున్నాయి. లక్ష్మణ్ మీసాల, తనికెళ్ల భరణి, షిజు ఏఆర్, మురళీధర్ గౌడ్, సమ్మెట గాంధీ, ప్రీతి సుందర్ కుమార్, బలగం సుధాకర్, ప్రార్ధిని, సంజయ్ కృష్ణ, హరిశ్చంద్ర తదితరులు ఈ సినిమాలో ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Show comments