Site icon NTV Telugu

Tollywood : హైదరాబాద్ లో ఘనంగా కళావేదిక ఫిల్మ్ మ్యూజిక్ అవార్డ్స్ ఫంక్షన్

Tollywood

Tollywood

కళావేదిక అవార్డ్స్ 59వ వార్షికోత్సవం సందర్భంగా బస్సా శ్రీనివాస్ గుప్త, భువన గారి ఆధ్వర్యంలో గీతరచయితలకు, గాయనీగాయకులకు, సంగీతదర్శకులకు అవార్డులు అందించడం జరిగింది. ఆర్.వి. రమణమూర్తి గారు ఎటువంటి ఆశయాల మేరకు కళావేదికను స్థాపించారో ఆ ఆశయాలను ఆయన కుమార్తె భువన గారు సఫలం చేస్తూ ఈ అవార్డుల కార్యక్రమం నిదర్శనంగా చెప్పవచ్చు. జనవరి 4వ తేదీన హైదరాబాద్ లోని ప్రసాద్ ఫిల్మ్ ల్యాబ్ లో జరిగిన ఈ కార్యక్రమానికి వాసవి గ్రూప్స్, ఉప్పల ఫౌండేషన్, మనెపల్లి జ్యువలరీ శ్రీ చరణ, కమ్యూనికేషన్ సదరన్ ట్రావెల్స్ పార్టీలు స్పాన్సర్లు సహాయక సహకారాలతో ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది.

Also Read : AlluArjun : అల్లు అర్జున్ ను అనుమతించని పోలీసులు

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర ఆర్య వైశ్య కార్పొరేషన్ చైర్ పర్సన్ శ్రీమతి కల్వ సుజాత గుప్త, దర్శకులూ ముప్పలనేని శివ, ఇంద్రగంటి మోహన్ కృష్ణ, సంగీత దర్శకులు ఆర్.పి.పట్నాయక్, ఎమ్ ఎమ్ శ్రీలేఖ, సింగర్ కౌసల్య, ప్రఖ్యాత సినీనటులు నందమూరి తారకరామారావు గారి మనవరాలు నందమూరి రూపాదేవి, కొల శ్రీనివాస్, గంధం రాములు, ఎల్.ప్రసన్నకుమార్, వినయ్ హరిహారన్ తదితరులు పాల్గొన్నారు.

Also Read : BA Raju : నేడు ప్రముఖ నిర్మాత, సినీ పాత్రికేయుడు బి. ఏ రాజు 65వ జయంతి

2024లో విడుదలై ఘనవిజయాలను సాధించిన సినిమాల్లో కృషి చేసిన గీతరచయితలను, సంగీతదర్శకులను, గాయనీగాయకులను, సౌండ్ ఇంజనీర్లను ఇలా పాట రూపుదిద్దుకోవడానికి శ్రమపడే ప్రతి కళాకారున్ని ఎంతో వైభవంగా సన్మానించారు. భవిష్యత్తులో ఇలాగే ఆర్.వి.రమణమూర్తి గారి ఆశయాల మేరకు కళావేదిక నిరంతరం పాటుపడుతోందని భువనగారు తెలియజేశారు.

Exit mobile version