శ్రీకాంత్ రిలీజ్ చేసిన ‘కళాకార్’ ఫస్ట్ లుక్ పోస్టర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘6 టీన్స్, జానకి వెడ్స్ శ్రీరామ్, నేను సీతామాలక్ష్మి, శంకర్‌దాదా ఎంబీబీఎస్, నవ వసంతం’ వంటి సినిమాలతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు హీరో రోహిత్. ప్రస్తుతం ఆయన హీరోగా శ్రీను బందెల దర్శకత్వంలో రూపొందుతోన్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘కళాకార్’. వెంకటరెడ్డి జాజాపురం నిర్మిస్తున్న ఈ చిత్రంలో షాయాజీ షిండే, పృథ్విరాజ్, రాజీవ్ కనకాల, శివశంకర్, రవికాలే, గగన్, కరాటే కళ్యాణి, జయలలిత, అశోక్‌కుమార్ వంటి ప్రముఖ నటులు కీలకపాత్రల్లో నటించారు. ఈ మూవీ ఫస్ట్‌లుక్ పోస్టర్ ను హీరో శ్రీకాంత్ రిలీజ్ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ – ”’కళాకార్’ టైటిల్ బాగుంది. అలాగే పోలీస్ ఇన్ స్పెక్టర్ గా రోహిత్ లుక్ కూడా చాలా బాగుంది. ఫస్ట్ టైమ్ రోహిత్‌ను పోలీస్ ఆఫీసర్ గెటప్‌లో చూస్తున్నాను. చాలా ఫిట్‌గా కనిపిస్తున్నారు. రోహిత్, నేను కలిసి ఎప్పటినుండో ఇండస్ట్రీలో ట్రావెల్ చేస్తున్నాం. ఆయన మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేయడం చాలా సంతోషంగా ఉంది” అని అన్నారు. హీరో రోహిత్ మాట్లాడుతూ – ”ఫస్ట్ టైమ్ యాక్షన్ అండ్ సస్పెన్స్ సబ్జెక్ట్‌తో చేస్తోన్న చిత్రమిది. నాది పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్. సినిమా చాలా బాగా వచ్చింది. తప్పకుండా మీ అందరికి నచ్చుతుంది” అని చెప్పారు. హీరో రోహిత్‌కు పర్‌ఫెక్ట్ రీ ఏంట్రీ సబ్జెక్ట్ ఇదని, మంచి కథ-కథనం, భారీ తారాగణంతో శ్రీను ఈ మూవీని తెరకెక్కించారని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ముగింపు దశలో ఉందని నిర్మాత వెంకటరెడ్డి తెలిపారు.
Also Read
- Johnny Master: చిరంజీవి సమక్షంలో కలిసిన జానీ మాస్టర్ - శేఖర్ మాస్టర్.. పెద్దరికం అంటే ఇదే!
- Sumalatha: డాన్సర్స్ అసోసియేషన్‌లో ఎలాంటి విభేదాలు లేవు.. అసలేం ఏం జరిగిందో చెప్పిన జానీ మాస్టర్ భార్య
- Jason Sanjay: దళపతి ప్లేస్‌ను కొడుకు రిప్లేస్ చేస్తాడా? డైరెక్టర్ నుంచి హీరోగా మారుతున్న విజయ్ కొడుకు
- Shruti Haasan: రమ్యకృష్ణ బ్యూటీ సీక్రెట్ రివీల్ చేసిన శృతిహాసన్.. అసలు కారణం ఇదేనట!

తాజావార్తలు
-
RBI Report: తీవ్ర ద్రవ్యోల్బణంలో తెలంగాణ.. ఆర్బీఐ నివేదిక
-
Johnny Master: చిరంజీవి సమక్షంలో కలిసిన జానీ మాస్టర్ – శేఖర్ మాస్టర్.. పెద్దరికం అంటే ఇదే!
-
Suryakumar Yadav: టీ20 జట్టులోకి మళ్లీ సూర్యకుమార్ యాదవ్..? బీసీసీఐ కీలక సంకేతాలు
-
UK-Iran: ఐఆర్జీసీపై బ్రిటన్ సంచలన నిర్ణయం.. ఉగ్ర సంస్థగా ప్రకటన
-
Harish Rao : రేవంత్ కేవలం ఉద్యమ ద్రోహే కాదు.. జలద్రోహి కూడా..
ట్రెండింగ్
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్‌బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!