బాలీవుడ్ స్టార్ హీరోయిన్లు ట్వింకిల్ ఖన్నా మరియు కాజోల్ కలిసి హోస్ట్ చేస్తున్న టాక్ షో ‘టూ మచ్ విత్ కాజోల్ అండ్ ట్వింకిల్’ ప్రస్తుతం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. ఈ షోలో వారు మాట్లాడుతున్న ఓపెన్ టాపిక్స్, బోల్డ్ కామెంట్స్ సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీస్తున్నాయి. ప్రేమ, పెళ్లి, రిలేషన్‌షిప్స్ గురించి వీరిద్దరూ నేరుగా మాట్లాడుతుండటంతో నెటిజన్లు ఆశ్చర్యపోతూ, ఒక్కోసారి వారిపై మీమ్స్ వేస్తున్నారు. ఇటీవల వచ్చిన ఎపిసోడ్‌లో “పెళ్లికి కూడా ఎక్స్‌పైరీ డేట్ ఉండాలి” అని కాజోల్ చెప్పడం పెద్ద సంచలనంగా మారింది. ఆ కామెంట్ ఇంకా చల్లారకముందే, మరోసారి బోల్డ్ స్టేట్‌మెంట్‌తో ఇద్దరూ హాట్ టాపిక్ అయ్యారు.
Also Read : Spirit: ప్రభాస్ ‘స్పిరిట్’ టీమ్‌లో స్టార్ వారసుల ఎంట్రీ? సందీప్ వంగా మాస్టర్ ప్లాన్ ఇదేనా?
తాజా ఎపిసోడ్‌లో, పెళ్లి ముందు వీరిద్దరూ ఒకే హీరోను డేట్ చేశాం అని వెల్లడించారు. ఈ మాట విన్న నెటిజన్లు షాక్ అవ్వడం సహజమే. అయితే, ఆ హీరో పేరు మాత్రం బయటపెట్టకుండా జాగ్రత్త పడ్డారు. దీంతో సోషల్ మీడియాలో ఊహాగానాలు వేడెక్కాయి. అక్షయ్ కుమార్ నా?అభిషేక్ బచ్చన్ నా? అనే రూమర్స్ నెట్టింట హాట్ డిబేట్ అయ్యాయి. ఎందుకంటే అక్షయ్ కుమార్ గతంలో రవీనా టాండన్, శిల్పా శెట్టి వంటి హీరోయిన్‌లతో రిలేషన్‌లో ఉన్నాడు. మరోవైపు కాజోల్ భర్త అజయ్ దేవగణ్ కూడా కరిష్మా కపూర్‌తో డేటింగ్ చేసిన వార్తలు అప్పట్లో పెద్ద సంచలనం అయ్యాయి. ఈ నేపథ్యంతో కాజోల్–ట్వింకిల్ తమ గత ప్రేమ సంబంధాల గురించి ఓపెన్‌గా మాట్లాడటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. దీంతో వాళ్ల బోల్డ్ రివీలేషన్స్‌పై కొందరు నెటిజన్లు “ఇలాంటి విషయాలు బయటపెట్టి పేర్లను వివాదాల్లోకి ఎందుకు లాగుతున్నారు?” అని కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం“ఇప్పటి జెనరేషన్ మొత్తం ఓపెన్‌గా మాట్లాడటం నార్మల్.. ఇది కొత్త ట్రెండ్!” అని సమర్థిస్తున్నారు. మొత్తం మీద “ఇద్దరం ఒక్కరినే డేట్ చేశాం” అన్న కాజోల్–ట్వింకిల్ కామెంట్ ప్రస్తుతం బాలీవుడ్ హంగామా క్రియేట్ చేస్తోంది.
