Kajol : అందం కోసం అలా చేయడంలో తప్పేం లేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అందంగా కనిపించాలని ఎవరికి మాత్రం ఉండదు చెప్పండి. అందులోను హీరోయిన్ ల గురించి చెప్పాల్సిన పని లేదు.. తెరపై బ్యూటీఫుల్‌గా కనిపించడం కోసం జిమ్ అని వర్కౌట్ అని డైటింగ్ అని నానా తంటాలు పడతారు. మరి కొంత మంది అయితే సర్జరీలు కూడా చేయించుకుంటారు. అలాంటి హీరోలు హీరోయిన్లు చాలా మంది ఉన్నారు. అయితే తాజాగా బాలీవుడ్ నటి కాజోల్ ఓ ఇంటర్వ్యూలో ఈ విషయం పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆమె నటించిన తాజా సినిమా ‘సర్ జమీన్’ ఇటీవల ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘జియో హాట్‌స్టార్’లో విడుదలైంది. ప్రమోషన్ సందర్భంలో మీడియాతో మాట్లాడుతూ, అందం పట్ల తన అభిప్రాయాన్ని స్పష్టంగా తెలియజేశారు.
Also Read : Payal : హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ ఇంట తీవ్ర విషాదం..
Also Read
- Mayuri Distributors: సుదీర్ఘ విరామం తర్వాత రంగంలోకి 'రామోజీ గ్రూప్'.. 'తెల్ల కాగితం'తో డిస్ట్రిబ్యూషన్లో ప్రకంపనలు!
- Anakapalli Producer Naidu: టికెట్ ఇవ్వలేదని థియేటర్‌నే కొనేసిన నిర్మాత.. వాట్ ఎ జర్నీ!
- Dhurandhar: ఇదెక్కడి ట్విస్ట్ .. సినిమా రిలీజ్ అయిన మళ్లీ సెన్సార్‌కి వెళ్లిన ‘ధురంధర్’ !
- NTR-Trivikram: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. గాడ్ ఆఫ్ వార్‌పై బిగ్గెస్ట్ అప్డేట్ ఇచ్చిన త్రివిక్రమ్!
“ఈ రోజుల్లో అందంగా కనిపించాలనుకోవడం మామూలే. అందుకోసం కాస్మొటిక్ సర్జరీలు చేసుకోవడంలో తప్పేమీ లేదు. కానీ దీనికోసం మహిళలనే బ్లేమ్ చేయడం సరైనది కాదు. సినీ పరిశ్రమలో చాలా మంది పురుషులు కూడా ఇవే చేస్తున్నారంటూ నిజాన్ని ఒప్పుకోవాలి, అని అన్నారు కాజోల్. ఆమె అభిప్రాయం ప్రకారం, కెమెరా ముందు ఉండే వారు తమను బాగా ప్రెజెంట్ చేసుకోవడం అవసరమే. అందం కోసం ప్రయత్నించడం తప్పకాదు. అలాంటి వారిని విమర్శించకుండా అర్థంతో చూడాలన్నది ఆమె సందేశం. అలాగే వయసు గురించి మాట్లాడిన కాజోల్, “సోషల్ మీడియాలో నా వయసు ఎందుకంత సమస్యగా మారిందో అర్థం కావడం లేదు. నా దృష్టిలో వయస్సు కేవలం ఒక సంఖ్య మాత్రమే. ఇంకా జీవించాల్సిన ఎన్నో అద్భుతమైన సంవత్సరాలు నా ముందున్నాయి,” అని తెలిపారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చకు దారితీశాయి, ముఖ్యంగా ఆమె స్పష్టత, ధైర్యానికి నెటిజన్ల నుంచి ప్రశంసలు వచ్చాయి.
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!