Site icon NTV Telugu

Kajol : అందం కోసం అలా చేయడంలో తప్పేం లేదు

Kajol (2)

Kajol (2)

అందంగా కనిపించాలని ఎవరికి మాత్రం ఉండదు చెప్పండి. అందులోను హీరోయిన్ ల గురించి చెప్పాల్సిన పని లేదు.. తెరపై బ్యూటీఫుల్‌గా కనిపించడం కోసం జిమ్ అని వర్కౌట్ అని డైటింగ్ అని నానా తంటాలు పడతారు. మరి కొంత మంది అయితే సర్జరీలు కూడా చేయించుకుంటారు. అలాంటి హీరోలు హీరోయిన్‌లు చాలా మంది ఉన్నారు. అయితే తాజాగా బాలీవుడ్ నటి కాజోల్ ఓ ఇంటర్వ్యూలో  ఈ విషయం పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆమె నటించిన తాజా సినిమా ‘సర్ జమీన్’ ఇటీవల ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘జియో హాట్‌స్టార్’లో విడుదలైంది. ప్రమోషన్ సందర్భంలో మీడియాతో మాట్లాడుతూ, అందం పట్ల తన అభిప్రాయాన్ని స్పష్టంగా తెలియజేశారు.

Also Read : Payal : హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ ఇంట తీవ్ర విషాదం..

“ఈ రోజుల్లో అందంగా కనిపించాలనుకోవడం మామూలే. అందుకోసం కాస్మొటిక్ సర్జరీలు చేసుకోవడంలో తప్పేమీ లేదు. కానీ దీనికోసం మహిళలనే బ్లేమ్ చేయడం సరైనది కాదు. సినీ పరిశ్రమలో చాలా మంది పురుషులు కూడా ఇవే చేస్తున్నారంటూ నిజాన్ని ఒప్పుకోవాలి, అని అన్నారు కాజోల్. ఆమె అభిప్రాయం ప్రకారం, కెమెరా ముందు ఉండే వారు తమను బాగా ప్రెజెంట్ చేసుకోవడం అవసరమే. అందం కోసం ప్రయత్నించడం తప్పకాదు. అలాంటి వారిని విమర్శించకుండా అర్థంతో చూడాలన్నది ఆమె సందేశం. అలాగే వయసు గురించి మాట్లాడిన కాజోల్, “సోషల్ మీడియాలో నా వయసు ఎందుకంత సమస్యగా మారిందో అర్థం కావడం లేదు. నా దృష్టిలో వయస్సు కేవలం ఒక సంఖ్య మాత్రమే. ఇంకా జీవించాల్సిన ఎన్నో అద్భుతమైన సంవత్సరాలు నా ముందున్నాయి,” అని తెలిపారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చకు దారితీశాయి, ముఖ్యంగా ఆమె స్పష్టత, ధైర్యానికి నెటిజన్ల నుంచి ప్రశంసలు వచ్చాయి.

Exit mobile version