Site icon NTV Telugu

‘నో మేకప్’ లుక్ లో మెరిసిపోతున్న చందమామ

Kajal Aggarwal shares No-Makeup Selfie

అందాల చందమామ కాజల్ అగర్వాల్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి దశాబ్దానికిపైగా అవుతోంది. 14 సంవత్సరాలుగా ఇండస్ట్రీలో రాణిస్తున్న కాజల్ ఇప్పటికి తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలలో స్టార్ హీరోయిన్ గానే కొనసాగుతున్నారు. ఇటీవల కాజల్ వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లును వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ కరోనా సమయంలో కాజల్ తన భర్తతో కలిసి ఎంజాయ్ చేస్తోంది. ఈ సమయంలో ఆమె సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గ ఉంటోంది. తరచూ తన స్టన్నింగ్ పిక్స్ తో నెట్టింట్లో వైరల్ అవుతోంది. తాజాగా కాజల్ షేర్ చేసిన ‘నో మేకప్’ లుక్ ఆకట్టుకుంటోంది. మంగళవారం (జూన్ 1) కాజల్ అగర్వాల్ తన అభిమానులతో నో మేకప్ సెల్ఫీని పంచుకున్నారు. ఇందులో ఆమె తెల్లటి చొక్కాలో కఫ్డ్ స్లీవ్స్‌తో, చీలిక జీన్స్‌తో కన్పిస్తోంది. “కొన్నిసార్లు మీరు చేయాల్సిందల్లా ఊపిరి పీల్చుకోవడమే” అనే క్యాప్షన్ ఇచ్చింది. కాజల్ నో మేకప్ లుక్ కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. కాగా కాజల్ చిరంజీవి “ఆచార్య” చిత్రంలో హీరోయిన్ గా కనిపించనుంది. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రామ్ చరణ్, పూజా హెగ్డే అతిధి పాత్రలలో నటిస్తున్నారు. తమిళ చిత్రం “హే సినమిక”లో దుల్కర్ సల్మాన్, అదితి రావు హైదరిలతో కలిసి నటిస్తోంది. ఇంకా “ఘోస్టీ” అనే హర్రర్ కామెడీ, కమల్ హాసన్”ఇండియన్ 2″లలో నటిస్తోంది.

Exit mobile version