Site icon NTV Telugu

Kajal Aggarwal: కాజల్‌ కసరత్తులు.. కత్తిపట్టి కలారిపాయట్టు సాధన

Kajal Aggarwal

Kajal Aggarwal

Kajal Aggarwal: తెలుగునాటనే తన కెరీర్ కు వెలుగుబాటలు వేసుకుంది కాజల్ అగర్వాల్. పెళ్ళయ్యాక మరింత అందంగా మారింది కాజల్ అంటూ అభిమానులు కీర్తిస్తూ ఉంటారు. కాజల్ తెరపై కనిపిస్తే చాలు అని అభిమానులు ఈ నాటికీ ఆశిస్తూ ఉన్నారు. అందుకు తగ్గట్టుగానే కాజల్ ఓ బిడ్డ తల్లయినా, ఇంకా కెమెరా ముందు నటించడానికి ఆసక్తి కనబరుస్తూ ఉంది. ఇక కమల్ హాసన్ కథానాయకుడిగా తెరకెక్కిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘ఇండియన్ 2’. ఈ సినిమాకు శంకర్ దర్శకత్వం వహిస్తుండగా లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మిస్తోంది. కాగా, ప్రస్తుతం ఇండియన్ 2 సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభమైంది. ఈసినిమాలో కమల్‌కు జోడీగా అందాల భామ కాజల్ అగర్వాల్ నటిస్తోంది. ఇండియన్‌-2 కోసం కాజల్ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటోంది. అయితే.. అతిపురాతనమైన యుద్ధ క్రీడ కలారిపాయట్టును సాధన చేస్తోంది.

ఈనేపథ్యంలో.. తాజాగా ఆమె ప్రాక్టీస్ చేస్తున్న వీడియోను తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతుంది. కాజల్‌ ఇటీవల మగబిడ్డకు జన్మనిచ్చిన ఈబ్యూటీ చాలా రోజుల తర్వాత తిరిగి షూటింగ్‌లో అడుగుపెట్టింది. అంతేకాదు ఇండియన్-2 సినిమాలో తన పాత్ర కోసం యుద్ధ కళలతో పాటు గుర్రపు స్వారీ కూడా నేర్చుకుంటోంది కాజల్. ఇక ఇన్‌స్టా పోస్టులో కలరిపాయట్టు ఒక పురాతన మార్షల్ ఆర్ట్స్‌, షావోలిన్, కుంగ్ ఫూ, కరాటే, తైక్వాండో క్రీడలు కలరిపాయట్టు నుంచి పుట్టుకొచ్చినవే. అయితే.. ఈ యుద్ధ క్రీడ సాధారణంగా గెరిల్లా యుద్ధంలో వినియోగిస్తారు. తనకు ఓపికగా నేర్పిస్తున్న మాస్టర్‌కు ధన్యవాదాలు అని రాసుకొచ్చింది. ఇండియన్‌-2లో సిద్దార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవాని శంకర్, బాబీ సింహా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అయితే.. రెండేళ్ల క్రితం సెట్స్‌లో అగ్నిప్రమాదం సంభవించి ముగ్గురు సిబ్బంది మృతి చెందడంతో షూటింగ్ నిలిపివేసిన విషయం తెలిసిందే..

కాజల్‌ దర్శకుడు తేజ తన ‘లక్ష్మీ కళ్యాణం’తో తెలుగు చిత్రసీమకు పరిచయం చేశాడు. తరువాత కృష్ణవంశీ ‘చందమామ’లా కాజల్ ను తీర్చిదిద్దాడు. ఇక రాజమౌళి తన ‘మగధీర’లో మిత్రవిందగా కాజల్ ను మార్చేశాడు. అప్పటి నుంచీ ఇప్పటి దాకా కాజల్ తెలుగు చిత్రాలలో మెరుస్తూనే ఉంది. తనదైన అందాల అభినయంతో ఆకట్టుకుంటూ సాగుతోంది. ‘మగధీర’లో రామ్ చరణ్ సరసన మురిపించిన కాజల్, ‘ఖైదీ నంబర్ 150’లో చిరంజీవితోనూ కలసి చిందేసి ఆకట్టుకుంది. 2020 అక్టోబర్ 6న గౌతమ్ కిచ్లూను పెళ్ళాడింది కాజల్. పెళ్ళయ్యాక కూడా కాజల్ కు ఏ మాత్రం క్రేజ్ తగ్గలేదు. కాజల్ ఓ బాబుకు జన్మనిచ్చింది. ప్రస్తుతం మూడు చిత్రాలలో నటిస్తోంది కాజల్. అందులో రెండు తమిళ చిత్రాలున్నాయి. ‘ఉమా’ అనే హిందీ సినిమా కూడా ఉంది.

Exit mobile version