Kaalam Raasina Kathalu Trailer launched: ఎంఎన్వీ సాగర్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన కాలం రాసిన కథలు సినిమా ట్రైలర్ ని పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ జగన్నాథ్ లాంచ్ చేశారు. ఈ క్రమంలో ఆకాష్ జగన్నాథ్ మాట్లాడుతూ ఆగస్టు 29న థియేటర్లో వస్తున్న ఈ సినిమా ట్రైలర్ నేను లాంచ్ చేయడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ట్రైలర్ చాలా అద్భుతంగా ఉందని, నటీనటులు కొత్తవాళ్లయినా పరిణితి చెందిన నటన కనబడుతుందని అన్నారు. ముఖ్యంగా ట్రైలర్లో ఐదు కథల మధ్య ఉన్న లవ్ కంటెంట్ మరియు డైలాగ్స్ చాలా ఇంట్రెస్ట్ గా ఉన్నాయని, దర్శకనిర్మత ఎంఎన్వీ సాగర్ ఈ చిత్రాన్ని చాలా కాన్ఫిడెంట్ గా తెరకెక్కించారని ట్రైలర్ చూస్తేనే అర్థమవుతుందని అన్నారు.
Karnataka: సీఎం సిద్ధరామయ్య, డీకే.శివకుమార్‌లకు కోర్టు సమన్లు.. ఏ కేసులో అంటే..!
కచ్చితంగా ఈ సినిమా యూత్ ని అట్రాక్ట్ చేస్తుందని అన్నారు. దర్శకనిర్మాత ఎంఎన్వీ సాగర్ మాట్లాడుతూ ఆగస్టు 29న థియేటర్లలో రాబోయే ఈ చిత్రం పూర్తి గ్రామీణ నేపథ్యంలో సాగే యూత్ ఫుల్ లవ్ మరియు ఫ్యామిలీ ఎంటర్టైనర్ డ్రామా అని నేచర్ కి చాలా దగ్గరగా ఉంటుందని అన్నారు. 60 సంవత్సరాల తర్వాత పునర్జన్మలో ఊపిరి పోసుకున్న బంధాలలో నమ్మకానికి మోసానికి మధ్య బలవుతున్న మనసు నలిగిపోయిన మనిషి జీవితాల్లో 30 సంవత్సరాల క్రితం మొదలైన పరువు హత్యల మధ్య ఈ కథ సాగుతుందని, సినిమా ఫైనల్ అవుట్ ఫుట్ చాలా బాగా వచ్చిందని అన్నారు. శృతి శంకర్ , వికాస్ , విహారికా చౌదరి, అభిలాష్ గోగుబోయిన, ఉమా రేచర్ల, రోహిత్ కొండ, హాన్విక శ్రీనివాస్, రవితేజ బోనాల, పల్లవి రాథోడ్ , రేష్మ ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు.