Site icon NTV Telugu

Kaala Rathri: ఆహాలో కాళరాత్రి.. ఎప్పటి నుంచి అంటే?

Kaalarathri

Kaalarathri

‘Kaala Raatri’ to stream on Aha from August 17th:’ఆహా’ఓటీటీలో పలు ఇతర భాషల సినిమాలను డబ్బింగ్ చేయించి రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఎక్కువ తమిళ, మలయాళ సినిమాలను డబ్ చేస్తున్నారు. బాబు రాజ్, చేంబన్ వినోద్, బిను పప్పు, గణపతి, తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా “కాళరాత్రి”. ఈ చిత్రాన్ని హనుమాన్ మీడియా బ్యానర్ పై బాలు చరణ్ నిర్మించగా మర్ఫీ దేవసి దర్శకత్వం వహించారు. సస్పెన్స్ థ్రిల్లర్ కథతో రూపొందిన కాళరాత్రి సినిమా ఈ నెల 17వ తేదీ నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కు రాబోతోంది.

Stock market: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్

ఇక “కాళరాత్రి” సినిమా ట్రైలర్ ఎలా ఉందో చూస్తే – 266 ఎకరాలను అతి తక్కువ ధరకు కొనేందుకు వెళ్లిన స్నేహితుల బృందం ఆ తోటలో ఉన్న గెస్ట్ హౌస్ చూసి సర్ ప్రైజ్ అవుతారు. ఎంతో అందంగా ఉన్న ఆ గెస్ట్ హౌస్ లో పార్టీ చేసుకోవడానికి సిద్ధమైతే ఆ భవనంలో అనూహ్య ఘటనలు జరుగుతుంటాయి. వారిలో కొందరు చనిపోతారు కూడా అయితే ఆ హత్యలకు కారణం ఎవరన్నది అంతు చిక్కదు. ఇలాంటి ఆసక్తికర మలుపులతో ట్రైలర్ ఆకట్టుకుంది. వీళ్లు ఎందుకు చనిపోతున్నారు? ఎలా చనిపోతున్నారు తెలియాలంటే మూవీ చూడాల్సిందే అంటున్నారు మేకర్లు. సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు కాళరాత్రి సినిమా బాగా నచ్చుతుందని అంటున్నారు.

Exit mobile version