NTV Telugu Site icon

KA : కిరణ్ అబ్బవరం ‘క’ మలయాళం రిలీజ్ ఎప్పుడంటే..?

Ka (2)

Ka (2)

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన భారీ పీరియాడిక్ థ్రిల్లర్ సినిమా “క”. శ్రీమతి చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రాస్ ఎంటర్ టైన్ మెంట్స్ తో బ్యానర్ పై చింతా గోపాలకృష్ణ రెడ్డి భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో నిర్మించారు. దర్శక ద్వయం సుజీత్, సందీప్ విలేజ్ బ్యాక్ డ్రాప్ యాక్షన్ థ్రిల్లర్ కథతో ‌”క” సినిమాను తెరకెకెక్కించారు. ఈ సినిమా 31న దీపా‌వళి పండుగ సందర్భంగా తెలుగులో గ్రాండ్ థియేట్రికల్ ఆయిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తో పాటు దీపావళి విన్నర్ గా నిలిచింది.

Also Read : Pushpa – 2 : స్పెషల్ సాంగ్ శ్రీలీల రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి వసూళ్లు రాబడుతున్న ఈ సినిమా ఇటీవల తమిల్ లో రిలీజ్ అయింది. లిమిటెడ్ స్క్రీన్స్ లో రిలీజ్ అయిన ఈ సినిమా  పర్వాలేదు  అనే టాక్ తెచ్చుకుంది. వాస్తవానికి ముందుగా మేకర్స్ ఈ సినిమానుపాన్ ఇండియా రిలీజ్ కి ప్లాన్ చేయాలనీ భావించారు. ఇక ఇప్పుడు కిరణ్ అబ్బవరం మలయాళంలో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు.  క సినిమా మలయాళం రిలీజ్ డేట్ ను ప్రకటించాడు. ఈ నవంబరు 22న కేరళలో ఈ   తెలుగులో సూపర్ హిట్ సాధించిన క తమిళ్, మలయాళం, హింది భాషల్లో ఏమేరకు రాణిస్తుందో, ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలి. దీపావళి కానుకగా రిలీజ్ అయిన క విజయంవంతంగా రెండవ వారంలోకి అడుగుపెట్టింది. ఇప్పటికే అన్ని ఏరియాస్ లో బ్రేక్ ఈవెన్ సాధించి బయ్యర్స్ కి భారీ లాభాలు తెచ్చి పెట్టింది.  ఈ సినిమా సక్సెస్ తో కెరీర్ హయ్యెస్ట్ వసూళ్లు రాబట్టాడు కిరణ్ అబ్బవరం.

Show comments