NTV Telugu Site icon

KA : ‘క’ సినిమా పాన్ ఇండియా రిలీజ్ డేట్స్ ఇవే.

Ka

Ka

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన భారీ పీరియాడిక్ థ్రిల్లర్ సినిమా “క”. శ్రీమతి చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రాస్ ఎంటర్ టైన్ మెంట్స్ తో బ్యానర్ పై చింతా గోపాలకృష్ణ రెడ్డి భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో నిర్మించారు. దర్శక ద్వయం సుజీత్, సందీప్ విలేజ్ బ్యాక్ డ్రాప్ యాక్షన్ థ్రిల్లర్ కథతో ‌”క” సినిమాను తెరకెకెక్కించారు. ఈ సినిమా 31న దీపా‌వళి పండుగ సందర్భంగా తెలుగులో గ్రాండ్ థియేట్రికల్ ఆయిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తో పాటు దీపావళి విన్నర్ గా నిలిచింది.

Also Read : SivaKarthikeyan : ‘అమరన్’ సినిమా చేయడానికి కారణం ఎవరంటే..?

రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి వసూళ్లు రాబడుతున్న ఈ సినిమా ఇప్పుడు పాన్ ఇండియా భభాషల్లో రిలీజ్ కానుంది. వాస్తవానికి ముందుగా మేకర్స్ ఈ సినిమానుపాన్ ఇండియా రిలీజ్ కి ప్లాన్ చేయాలనీ భావించారు. అందుకు తగ్గట్టుగా ట్రైలర్ కూడా రిలీజ్ చేసారు మేకర్స్. కానీ తమిళనాడులో థియేటర్స్ దొరక్కపోవడం, మళయాలంలో దుల్కర్ సల్మాన్ రిలీజ్ ఉండడంతో సినిమాను పాన్ ఇండియా రిలీజ్ వాయిదా వేశారు. కాగా ఇప్పుడు తాజాగా ఇతర బాషల రిలీజ్ డేట్స్ ను ప్రకటించారు మేకర్స్. కేరళ వ్యాప్తంగా దుల్కర్ సల్మాన్ విడుదల చేస్తున్న ఈ సినిమా మలయాళ వెర్షన్ ఈ నవంబర్ 15న విడుదల కానుంది. హిందీ, తమిళ్ లో నవంబర్ 22న “క” థియేటర్స్ లో రిలీజ్ కానుంది. తెలుగులో సూపర్ హిట్ సాధించిన క తమిళ్, మలయాళం, హింది భాషల్లో ఏమేరకు రాణిస్తుందో, ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలి.

Show comments