NTV Telugu Site icon

kA : 50 కోట్ల క్లబ్ లో కిరణ్ అబ్బవరం..

Ka

Ka

యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన భారీ పీరియాడిక్ థ్రిల్లర్ సినిమా “క”. ఈ సినిమాలో నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్స్ గా నటించారు. శ్రీమతి చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రాస్ ఎంటర్ టైన్ మెంట్స్ తో బ్యానర్ పై చింతా గోపాలకృష్ణ రెడ్డి  నిర్మించారు. దర్శక ద్వయం సుజీత్, సందీప్ విలేజ్ బ్యాక్ డ్రాప్ యాక్షన్ థ్రిల్లర్ కథతో ‌”క” సినిమాను తెరకెకెక్కించారు. ఈ సినిమా 31న దీపా‌వళి పండుగ సందర్భంగా తెలుగులో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ అయింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో “క” సినిమాను ప్రొడ్యూసర్ వంశీ నందిపాటి రిలీజ్ చేసారు.

Also Read : Matka : ‘వరుణ్ తేజ్’ మేల్కోవాల్సిన టైమ్ వచ్చిందా..?

ఆక్టోబరు 30న ప్రీమియర్స్ తో రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. సెన్సేషనల్ ఓపెనింగ్ రాబట్టిన ఈ సినిమా మొదటి రోజు వరల్డ్ వైడ్ గా రూ. 6.18 కోట్లు  రాబట్టింది.ఈ ఓపెనింగ్ కిరణ్ అబ్బవరం కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్.  దీనికితోడు మౌత్ టాక్ బాగుండడంతో క హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో నడిచింది. పోటీలో రెండు భారీ సినిమాలతో పాటు రిలీజ్ అయినా కూడా ఈ  సినిమా మంచి కంటెంట్ తో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఇటీవల  విజయవంతంగా 3వ వారంలోకి అడుగుపెట్టిన ‘క’ ఈ గురవారంతో రూ. 50 కోట్ల క్లబ్ లో చేరింది. కిరణ్ అబ్బవరం కెరీర్ లోనే హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా క నిలవడమే కాకుండా ఎంతో గుర్తింపు తీసుకువచ్చింది. కేవలం తెలుగులోనే ఈ రేంజ్ కలెక్షన్స్ రాబట్టడం విశేషం.