NTV Telugu Site icon

KA : దివ్యాంగుల కోసం ‘క’ స్పెషల్ షో..

Ka (2)

Ka (2)

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన భారీ పీరియాడిక్ థ్రిల్లర్ సినిమా “క”. ఈ సినిమాలో నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్స్ గా నటించారు. శ్రీమతి చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రాస్ ఎంటర్ టైన్ మెంట్స్ తో బ్యానర్ పై చింతా గోపాలకృష్ణ రెడ్డి భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో నిర్మించారు. దర్శక ద్వయం సుజీత్, సందీప్ విలేజ్ బ్యాక్ డ్రాప్ యాక్షన్ థ్రిల్లర్ కథతో ‌”క” సినిమాను తెరకెకెక్కించారు.

Also Read : Nithin : నితిన్ కు ఊపిరి పోసిన సినిమా మళ్ళి వస్తోంది..

రెండు తెలుగు రాష్టాల్లో క సూపర్ హిట్ టాక్ తో బ్లాక్ బస్టర్ వసూళ్లతో దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలో మేకర్స్ హైదరాబాద్ లోని RTC X రోడ్ లోని సంధ్య 70 ఎంఎంలో దివ్యాంగుల కోసం ‘క’ స్పెషల్ షో ఏర్పాటు చేసారు.  చప్పట్లు, కేరింతలతో ‘క’ సినిమా చూస్తూ చిన్నారులు ఎంజాయ్ చేసారు. తమ కోసం స్పెషల్ గా సినిమాను ప్రదర్శించిన యూనిట్ కు అలాగే చిత్ర హీరో కిరణ్ అబ్బవరం, డిస్ట్రిబ్యూటర్ వంశి నందిపాటికి చిన్నారులు కృతజ్ఞతలు తెలిపారు. గతనెల 31న దీపా‌వళి పండుగ సందర్భంగా తెలుగులో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ అయిన క యునానిమస్ బ్లాక్ బస్టర్ టాక్ అందుకుని దీపావళి విన్నర్ గా నిలిచింది. ఇప్పటికే అన్ని ఏరియాలలో బ్రేక్ ఈవెన్ సాధించి లాభాల బాటలో పయనిస్తోంది కిరణ్ అబ్బవరం క. ప్రస్తుతం సక్సెస్ టూర్ లో భాగంగా థియేటర్స్ విజిట్ చేస్తున్నారు యూనిట్.

Show comments