Site icon NTV Telugu

Jyotika: 45 ఏళ్ళ వయసులో కూడా జ్యోతిక ఇంత అందంగా ఉండడానికి కారణమేంటో తెలుసా?

Jyothika Video Viral

Jyothika Video Viral

Jyotika Latest Workout Video Goes Viral: హీరోయిన్ జ్యోతిక గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తమిళ్ లో హీరోయిన్ ఎంట్రీ ఇచ్చిన ఆమె తెలుగులో కూడా ఎన్నో సినిమాలు చేసింది. సూర్యను వివాహం చేసుకున్న తర్వాత కొంతకాలం పాటు సినిమాలకు దూరంగా ఉన్న ఆమె పిల్లలు పెద్దయిన తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టింది. ప్రస్తుతానికి ఆమె తమిళంలో ఎక్కువగా లేడీ ఓరియెంటెడ్ స్క్రిప్టులు ఎంచుకుంటూ ఆసక్తికరమైన సినిమాలు చేస్తూ ముందుకు వెళుతుంది. అయితే తాజాగా జ్యోతిక జిమ్ వర్కౌట్ చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Kaala Rathri: ఆహాలో కాళరాత్రి.. ఎప్పటి నుంచి అంటే?

అందులో ఆమె చాలా కష్టపడుతూ కనిపిస్తోంది. దీంతో ఆమె అభిమానులు అందరూ ఆమె ఫిట్నెస్ కి ఇదే కారణం అందుకే 45 ఏళ్ల వయసులో కూడా ఇంత ఫిట్ గా కనిపిస్తోంది అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇక జ్యోతిక చేసిన కాదల్ ది కోర్ అనే సినిమాకి కేరళ స్టేట్ అవార్డులు లభించాయి. మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ఒక గే స్టోరీగా తెరకెక్కించారు. సినిమా రిలీజ్ అయినప్పుడే సినిమా మీద ప్రశంసల వర్షం కురిసింది. ఇక తాజా వీడియో మీరు కూడా చూసేయండి.

Exit mobile version