టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ గాయపడినట్లు కొద్దిసేపటి క్రితం సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. వెంటనే జూనియర్ ఎన్టీఆర్ టీమ్‌ని సంప్రదించే ప్రయత్నం చేయగా వారు కూడా గాయాలైన మాట వాస్తవమేనని, అయితే పెద్దగా సీరియస్ గాయాలు ఏమీ కాదని వెల్లడించారు. అయితే ఇప్పుడు తాజాగా జూనియర్ ఎన్టీఆర్ ఆఫీస్ నుంచి ఒక అఫీషియల్ స్టేట్‌మెంట్ రిలీజ్ అయింది. ఈ రోజు ఒక అడ్వర్టైజ్‌మెంట్ షూటింగ్ చేస్తున్న సమయంలో ఒక మైనర్ ఇంజురీ జరిగిందని చెప్పుకొచ్చారు.
Also Read :Jr NTR Injured: ఎన్టీఆర్‌కు గాయాలు.. షాక్ లో ఫాన్స్!
అయితే డాక్టర్ల సలహా మేరకు ఆయన వచ్చే రెండు వారాలు రెస్ట్ తీసుకోబోతున్నారని, అలా చేస్తేనే పూర్తిగా రికవరీ అవుతారని డాక్టర్లు సూచించినట్లు వెల్లడించారు. అలాగే ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అఫీషియల్ స్టేట్‌మెంట్‌లో పేర్కొన్నారు. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్, మీడియా అలాగే పబ్లిక్‌ను ఈ విషయంలో ఎలాంటి ప్రచారాలకు తావు ఇవ్వద్దని స్టేట్‌మెంట్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతానికి జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ అనే సినిమా చేస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ సినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తోంది.
