Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Junior Movie Kireeti Reddys Debut Film Set For July 18 Release

K.K Senthil Kumar: ‘జూనియర్‌’ కథ నాకు చాలా నచ్చింది.. RRR తర్వాత ఈ సినిమా అందుకే!

Published Date :July 12, 2025 , 10:14 pm
By Bhargav Chaganti
K.K Senthil Kumar: ‘జూనియర్‌’ కథ నాకు చాలా నచ్చింది.. RRR తర్వాత ఈ సినిమా అందుకే!
  • Follow Us :
  • google news
  • dailyhunt

ప్రముఖ రాజకీయ నాయకుడు, వ్యాపారవేత్త గాలి జనార్ధన్ రెడ్డి కుమారుడు కిరీటి రెడ్డి, రాధా కృష్ణ దర్శకత్వం వహించిన యూత్ ఎంటర్‌టైనర్ ‘జూనియర్‌’తో హీరోగా అరంగేట్రం చేస్తున్నాడు. శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. వారాహి చలన చిత్రం బ్యానర్‌పై రజని కొర్రపాటి నిర్మిస్తున్నారు. ఈ సినిమా పాటలు చార్ట్‌బస్టర్‌ హిట్ అయ్యాయి. టీజర్, ట్రైలర్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రానికి స్టార్ సినిమాటోగ్రాఫర్ కె.కె. సెంథిల్ కుమార్ డివోపీగా పని చేస్తున్నారు. సినిమా జూలై 18న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా సినిమాటోగ్రాఫర్ కె.కె. సెంథిల్ కుమార్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలని పంచుకున్నారు.

ఈ ప్రాజెక్టు ఎలా స్టార్ట్ అయింది?
-నిర్మాత సాయి గారితో నాకు మంచి పరిచయం ఉంది. ఆయనతో ‘ఈగ’ సినిమా చేశాను. ఆర్ఆర్ఆర్ తర్వాత ఈ సినిమా గురించి చెప్పారు. డైరెక్టర్ రాధాకృష్ణ చెప్పిన కథ నాకు చాలా నచ్చింది. మంచి ప్రొడక్షన్ హౌస్, టెక్నికల్ టీం కూడా చాలా బాగుంది. అలా ఈ ప్రాజెక్ట్ చేయడం జరిగింది.

ఈ కథలో మిమ్మల్ని అట్రాక్ట్ చేసిన ఎలిమెంట్ ఏమిటి ?
-కొత్తవారిని పరిచయం చేసినప్పుడు ఫ్యామిలీ డ్రామా జానర్ కి వెళ్ళరు. డాన్స్లు ఫైట్లు ఉంటే చాలు అనుకుంటారు. కానీ ఈ సినిమాలో స్ట్రాంగ్ ఎమోషన్ ఉంది. అది నాకు చాలా ఇంప్రెస్ చేసింది. కొత్త హీరో ఇలాంటి ఛాలెంజ్ తీసుకొని చేయడం అనేది నాకు చాలా నచ్చింది

హీరో కిరీటి గురించి?
-కిరీటి చాలా హార్డ్ వర్కర్. చాలా అద్భుతమైన డాన్సర్. యాక్షన్ చాలా బాగా చేస్తాడు. తన యాక్టింగ్ కూడా చాలా బాగుంది. తను బ్యాలెన్స్డ్ యాక్టర్. తను వన్ ఆఫ్ ది బెస్ట్ న్యూ కమ్మర్.

మీరు రాజమౌళి గారితో పెద్ద కాన్వాస్ సినిమాలు చేశారు. ఇప్పుడు జూనియర్ లాంటి న్యూ కమ్మర్ సినిమాని ఎంచుకోవడానికి కారణం?
-ప్రతి సినిమా దేనికదే ప్రత్యేకం. ఒక హెవీ గ్రాఫిక్స్ సిజీ వర్క్ ఉన్న సినిమా తర్వాత ఇలాంటి సినిమా చేయడం నాకూ రిఫ్రెష్ గా అనిపించి చేశాను. ఇందులో ఉన్న కోర్ ఎమోషన్ నాకు చాలా నచ్చింది. ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాస్ రావడం తగ్గిపోయింది. ఇలాంటి సమయంలో ఈ సినిమా చేసే అవకాశం రావడం ఆనందంగా ఉంది.

-ఈ సినిమా పాటలు జనాలకి నచ్చాయి. వైరల్ వయ్యారి పాటలో కిరీటి శ్రీలీల డ్యాన్సులు అందరినీ ఆకట్టుకున్నాయి. ట్రైలర్ కూడా బాగా నచ్చింది. ప్రమోషనల్ కంటెంట్ అంతా బాగా రీచ్ అవుతుంది. కచ్చితంగా సినిమాని ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు.

మీరు ఒక సినిమాని సెలెక్ట్ చేసుకోవాలంటే కథలో ఎలాంటి ఎలిమెంట్స్ చూస్తారు?
స్టోరీ ఎమోషనల్ గా మూవ్ అవుతుందో లేదో చూస్తాను. అది చాలా ఇంపార్టెంట్. ఎమోషన్ మనల్ని కదిలించకపోతే మిగతా ఎలాంటి ఎలిమెంట్స్ ఉన్నా కూడా వర్కౌట్ అవ్వదు.

మీరు రాజమౌళి గారితో కంటిన్యూగా పని చేశారు కదా..ఇప్పుడు చేస్తున్న సినిమాకి గ్యాప్ రావడానికికారణం ఏమిటి?
-ఇప్పుడే కాదండి. గతంలో కూడా రాజమౌళి గారు నేను వరుసగా సినిమాలు చేస్తున్నప్పుడు మధ్యలో గ్యాప్ ఉండేది. విక్రమార్కుడు, మర్యాద రామన్న నేను చేయలేదు. దీనికి షాక్ అవ్వాల్సిన అవసరం లేదు(నవ్వుతూ) తర్వాత మేము కలిసి పని చేస్తాం.

రవిచంద్రన్ గారితో పనిచేయడం ఎలా అనిపించింది?
రవిచంద్రన్ గారు గ్రేట్ యాక్టర్. ఆయన ఏజ్ లో ఆయనకున్న ఎనర్జీ చూస్తే అన్ బిలియబుల్ అనిపిస్తుంది. ఆయనతో వర్క్ చేయడం రియల్లీ గ్రేట్ ఎక్స్పీరియన్స్

జెనీలియా గారి క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది?
ఇందులో చాలా డిఫరెంట్ జెనీలియాని చూశారు. ఈ సినిమాలో ఆమె పాత్ర, పెర్ఫార్మన్స్ సరికొత్తగా ఉంటుంది. ఆడియన్స్ చాలా సర్ప్రైజ్ అవుతారు.

డైరెక్టర్ గారి గురించి ?
-డైరెక్టర్ రాధాకృష్ణ చాలా క్లియర్ విజన్ ఉన్న డైరెక్టర్. ఆయనకు ఏం కావాలో చాలా క్లారిటీ ఉంటుంది. ఆయన కథ చెప్పిన విధానం తీసిన విధానం నాకు చాలా నచ్చింది. డైరెక్టర్ కి క్లారిటీ చాలా ఇంపార్టెంట్. ఆ క్లారిటీ ఆయనలో ఉంది.

నిర్మాత సాయి గారి గురించి?
-ఒక కొత్త హీరోని ఎంత అద్భుతంగా లాంచ్ చేయాలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ప్రొడక్షన్ చేశారు. ఒక మంచి సినిమా అందించాలనే పాషన్ తో పని చేశారు. చాలా అద్భుతమైనటువంటి టెక్నికల్ టీం ని ఎంపిక చేసుకున్నారు దేవిశ్రీప్రసాద్ గారి మ్యూజిక్, పీటర్ హెయిన్ లాంటి ఫైట్ మాస్టర్.. టెక్నికల్ గా సినిమా చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది వారాహి ప్రొడక్షన్ లో వర్క్ చేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది.

మీకు దర్శకత్వం చేసే ఆలోచన ఉందా?
-ఆలోచన అయితే ఉంది. అదే అయితే అది ఇప్పుడే కాదు. దానికి ఇంకా చాలా సమయం ఉంది. కొన్ని కథల మీద వర్క్ చేయడం జరుగుతుంది.

మీ జర్నీని చూసుకున్నప్పుడు ఎలా అనిపిస్తుంది?
-ఇండస్ట్రీ లోకి వచ్చి 25 ఏళ్ల అవుతుంది. ఈ 25 ఏళ్ళు మంచి సినిమాలు చేస్తున్నాం, చక్కగా పనిచేస్తున్నామనే పేరు తెచ్చుకోవడం చాలా ఆనందంగా ఉంది. బాహుబలి, ఆర్ఆఆర్ లాంటి సినిమాలు చేసే అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను.

కొత్తగా చేస్తున్న సినిమాలు గురించి?
-స్వయంభు చేస్తున్నాను. అది బహుబలి లాంటి జోనరు. రాజులనాటి కథ. అలాగే ఇండియన్ హౌస్ సినిమా చేస్తున్నాను.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Devi Sri Prasad
  • Family Drama
  • gali janardhan reddy
  • July 18 release
  • Junior movie

తాజావార్తలు

  • Iran Warning: భూతల దాడులు చేస్తే… అమెరికాకు అదే గతి.. ఇరాన్ పత్రిక వార్నింగ్

  • Viral Video: సీఎం బుగ్గపై ముద్దు పెట్టిన మహిళ.. నెట్టింట వీడియో వైరల్..

  • Story Board : ఇరాన్ ఉచ్చులో ట్రంప్..! యుద్ధం మొదలుపెట్టి.. ఎగ్జిట్ దొరకక అమెరికా అయోమయం

  • Growth Risks: భారత ఆర్థిక వృద్ధికి పొంచి ఉన్న ముప్పు.. భారీగా తగ్గిన అంచనాలు..

  • Trump: ‘నా కాళ్లకు నమస్కరిస్తాడని అనుకోలేదు’.. సౌదీ యువరాజుపై బాంబ్ పేల్చిన ట్రంప్

ట్రెండింగ్‌

  • Kitchen Tips : వేసవిలో పాలు త్వరగా పాడవుతున్నాయా..? అయితే ఈ సింపుల్ ట్రిక్ మిస్ కాకండి.!

  • కొత్త ఫీచర్లు, మెరుగైన 25కి పైగా అప్డేట్స్‌తో Hyundai Exter Facelift లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే..!

  • Jowar Dibbrotte Recipe: పైకి కరకరలాడుతూ, లోపల మెత్తగా ఉండే.. ఆరోగ్యకరమైన ‘జొన్న దిబ్బరొట్టె’ చేసేయండి ఇలా..!

  • స్పోర్టీ లుక్+బెటర్ గ్రిప్.. స్పోర్టీ రైడింగ్ కోసం కొత్త 2026 Royal Enfield Guerrilla 450 Apex వచ్చేసింది.. ధర ఎంతంటే.?

  • Hiccups Remedies : వెక్కిళ్లు ఆగడం లేదా.? ఈ చిట్కాలతో 30 సెకన్లలో చెక్ పెట్టండి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions