NTRNEEL : డ్రాగన్ పార్ట్ – 2 కోసం ఎన్టీఆర్ షాకింగ్ మేకోవర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ టైగర్ ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రాబోతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘డ్రాగన్’. ఈ సినిమాపై అటు నందమూరి అభిమానులతో పాటు, ఇటు సామాన్య ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం వచ్చే ఏడాది జూన్‌లో రిలీజ్ కానుండగా.. ఎన్టీఆర్ ఫిజిక్ పట్ల వస్తున్న అప్డేట్స్ మాత్రం సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తున్నాయి. ఇటీవల ఎన్టీఆర్ తన సిక్స్ ప్యాక్ బాడీ, కండలు తిరిగిన దేహంతో కనిపించిన ఫోటో నెట్టింట వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. ఈ కొత్త లుక్ చూసి అభిమానులు ఫిదా అయ్యారు.
డ్రాగన్ కోసం తారక్ చాలా వరకు వెయిట్ లాస్ అయ్యాడు. టైగర్ లీన్ లుక్‌తో ప్రశాంత్ నీల్ ఇచ్చే ఎలివేషన్ పీక్స్‌లో ఉంటుందనే హైప్ క్రియేట్ అయింది. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ ట్రాన్స్ఫర్మేషన్ మామూలుగా ఉండదని తెలుస్తోంది. ఇప్పటి వరకు సన్నగా కనిపించిన తారక్.. మరో ఊహించని మేకోవర్‌లో కనిపించనున్నాడట. ఈసారి బరువు పెరిగి బల్క్ బాడీతో ఫిట్‌గా కనిపించనున్నాడట. అయితే ఈ లుక్ పార్ట్ 2 కోసం అని తెలుస్తోంది. ఈ సినిమా రెండు భాగాలుగా ప్లాన్ చేస్తున్నట్టుగా టాక్ ఉండగా.. పార్ట్ 1తో పాటు సెకండ్ పార్ట్ షూటింగ్ కంప్లీట్ చేయడానికి కసరత్తులు చేస్తున్నారు. కథా పరంగా చూస్తే.. రెండో భాగంలో హీరో పాత్ర మరింత శక్తివంతంగా భారీగా కనిపించాల్సి ఉందట. అందుకే.. ఎన్టీఆర్ తన బాడీని భారీగా బల్క్ చేయడానికి రెడీ అవుతున్నట్టుగా టాక్. ఈ లుక్ రెండో భాగానికి లీడ్ ఇచ్చేలా ఉంటుందనే చెప్పాలి. ఏదేమైనా.. ఈ సినిమా కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు అభిమానులు.
Also Read
తాజావార్తలు
-
DA Hike: విద్యుత్ ఉద్యోగులకు సర్కార్ గుడ్‌న్యూస్..
-
Kitchen Tips : చపాతీ ఎక్కువ సేపు మెత్తగా ఉండాలంటే.. పిండి కలిపేటప్పుడు ఈ చిట్కాలను పాటించండి.!
-
Off The Record: సత్యవేడు టీడీపీలో ఆల్ సెట్ అయినట్టేనా..?
-
Chicken Bones : చికెన్ తిన్నాక ఎముకలను పారేస్తున్నారా.? వాటితో ఎన్నో ప్రయోజనాలు.!
-
India-UK: జూలై 15 నుంచి స్వేచ్ఛా వాణిజ్య అమలు.. ఏవేవి తగ్గనున్నాయంటే..!
ట్రెండింగ్
-
Hair Care Tips : జుట్టు త్వరగా జిడ్డుగా మారుతోందా? ఈ సింపుల్ టిప్స్‌తో రోజంతా ఫ్రెష్‌గా!
-
Cleaning Hacks : బాత్రూమ్ బకెట్లు నల్లగా మారాయా.? ఈ ఒక్క చిట్కాతో కొత్తవాటిలా మెరిపించండి.!
-
Vaibhav Sooryavanshi Controversy: వైభవ్ అవుట్‌పై వివాదం.. థర్డ్ అంపైర్ నిర్ణయంపై అఫ్గాన్ ప్లేయర్స్ అసంతృప్తి!
-
Ragi Bun Dosa: ఆరోగ్యం, రుచి రెండూ ఒకేచోట.. స్పాంజీ లాంటి ‘రాగి బన్ దోస’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Wedding Expenses: పెళ్లి ముహూర్తాలకు వేళాయే.. తక్కువ టైమ్ ఉండటంతో తెలుగు ఇళ్లల్లో బడ్జెట్ టెన్షన్!!