Site icon NTV Telugu

Jr NTR: మీరు ఇలాగే అరిస్తే నేను వెళ్లిపోతా!

Jr Ntr

Jr Ntr

అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో జరిగింది. ఈ ఈవెంట్‌కి జూనియర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విజయశాంతి మాట్లాడుతూ, ఉండగానే ఎన్టీఆర్ , కళ్యాణ్ రామ్ ఇద్దరూ స్టేజ్ మీదకు వెళ్లారు. విజయశాంతి మాట్లాడుతూ, “జూనియర్ ఎన్టీఆర్ గారికి ఈ ఈవెంట్‌కు వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సినిమా గురించి చెప్పాలంటే, కళ్యాణ్ రామ్ గారు, నేను ‘అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి’ సినిమా చేశాము,” అని అన్నారు. అప్పుడే జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‌తో కలిసి స్టేజ్ మీదకు వెళ్లే ప్రయత్నం చేశారు.

Vijaya Shanthi : ఈ సినిమా చెయ్యొద్దు అనుకున్నా!

విజయశాంతి మాట్లాడుతూ, “ఇది అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ మూవీ. ఒక తల్లి పడే ఆరాటం, కొడుకు చేసే పోరాటం, ఈ సినిమాలో మా ఇద్దరి మధ్య జరిగే యుద్ధం రేపు సినిమా చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది,” అని అన్నారు. ఈలోపు “ఎన్టీఆర్” అంటూ ఎన్టీఆర్ అభిమానులు నినాదాలు చేస్తున్న సమయంలో, ఎన్టీఆర్, “మీరు ఇలాగే అరిస్తే నేను వెళ్లిపోతాను,” అంటూ బెదిరించే ప్రయత్నం చేశారు. వెంటనే విజయశాంతి, ఎన్టీఆర్ చేతిని పట్టుకుని తన పక్కకు తీసుకొచ్చి నిలబెట్టుకున్నారు. విజయశాంతి మాట్లాడుతూ, “అభిమానుల అభిమానం కంట్రోల్ చేయలేకపోతున్నాము,” అని అన్నారు. అప్పుడు ఎన్టీఆర్ తన అభిమానులను కంట్రోల్ చేయడం కనిపించింది.

Exit mobile version