Site icon NTV Telugu

JR. NTR : ఏపీ సీఎం చంద్రబాబుకు జూనియర్ ఎన్టీఆర్ కృతజ్ఞతలు

Jr Ntr

Jr Ntr

బాలయ్య, నారా లోకేష్, నారా చంద్రబాబు నాయుడు.. ఈ ముగ్గురిలో జూనియర్ ఎన్టీఆర్ ఎవరి గురించి అయినా ట్వీట్ చేసాడంటే అది అటు ఫ్యాన్స్ కు ఇటు టీడీపీ అభిమానులకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. బాబాయ్ – అబ్బాయ్ లను ఒకే వేదికపై చూడాలని నందమురి ఫ్యాన్స్ ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. గతంలో సినిమా ఫంక్షన్స్ లో వీరుఇరువరు కలిసినపుడు అభిమానులు ఏంటో ఖుషి అయ్యారు. కానీ ఇప్పడు ఎవరికి వారే అనేలా ఉంటున్నారు. ఎవరి కారణాలు వారివి అది వారి వ్యక్తిగతం. బాబాయ్ బర్త్ డే నాడు అబ్బయ్ ట్వీట్ చేస్తే సోషల్ మీడియాలో సెన్సషన్ క్రియేట్ చేసింది.

Also Read : Coolie : కూలీకి అడ్వాన్స్ బుకింగ్స్ క్రేజ్ కు ఎక్కువ క్రెడిట్ ఇవ్వాల్సింది రజినీకి కాదు

ఇక నారా లోకేష్ కానీ చంద్రబాబు కానీ ఎన్టీఆర్ కు సంబందించిన ట్వీట్ చేసినా, నారావారిని ఉద్దేసించి ఎన్టీఆర్ ట్వీట్ చేసిన క్యాడర్ లో ఉండే జోష్ ఎవరికి తెలియదు. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ ఏపీ ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడుకు కృతజ్ఞలు తెలుపుతూ ట్వీట్ చేసారు. ఎన్టీఆర్ నటించిన వార్ 2 నేడు రాత్రి ప్రిమియర్స్ తో వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో అడుగుపెట్టబోతుంది. కాగా ఆ సినిమాకు ఏపీలో టికెట్స్ రేట్లు పెంచుతూ ఏపీ ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. ఈ సందర్భంగా ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడుకు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ కు ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్ చేసారు. కారణం ఏదైనా ఎన్టీఆర్ ట్వీట్ పట్ల ఫ్యాన్స్, క్యాడర్ లో ఓ తెలియని సంతోషం అయితే ఉంది.

Exit mobile version