NTV Telugu Site icon

Indian2 Effect : భారతీయుడు -2 దెబ్బకు అబ్బా అంటున్న తారక్, చరణ్ ఫ్యాన్స్‌ ..?

Untitled Design (3)

Untitled Design (3)

శంకర్, కమల్ హాసన్ ల కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ భారతీయుడు. ఆ సూపర్ హిట్ చిత్రానికి కొనసాగింపుగా వచ్చిన భారతీయుడు -2 నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలయింది. ఎన్నో అంచనాలతో రిలీజ్ అయిన భారతీయుడు -2 మొదటి షో నుండే నెగిటివ్ టాక్ తెచ్చుకుని ప్రదర్శితమవుతోంది.

కాగా ఈ చిత్రం నెగటివ్ టాక్ పట్ల అటు jr. ఎన్టీయార్, ఇటు రామ్ చరణ్ అభిమానులు ఆందోళ వ్యక్తం చేస్తున్నారు. దీనికి కారణం లేకపోలేదు. శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా “గేమ్ చేంజర్” అనే సినిమాలో నటిస్తున్నాడు. దిల్ రాజు బ్యానర్ లో అత్యంత భారీస్థాయిలో నిర్మిస్తున్న ఈ చిత్రం గత రెండేళ్లుగా షూటింగ్ జరుగుతూనే ఉంది. కాగా భారతీయుడు-2 కథ బాగున్నప్పటికి దాన్ని తెరపై మలచడంలో తడబడ్డాడు దర్శకుడు శంకర్. అనవసరపు సాగతీత సీన్స్, లాంగ్ రన్ టైమ్ తో ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించాడు. ఇదే రామ్ చరణ్ ఫ్యాన్స్ భయానికి కారణం అవుతోంది. తమ హీరో చిత్రాన్ని ఈ దర్శకుడు ఏ విధంగా తీశాడోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మరో వైపు తారక్ ఫ్యాన్స్ భయం ఇంకో రకం. ప్రస్తుతం దేవర అనే పాన్ఇండియా సినిమా చేస్తున్నాడు తారక్. కొరటాల శివ దర్శకత్వంలో వస్తోన్న ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. కాగా ఇండియన్ -2పై వస్తోన్న విమర్శలలో అనిరుధ్ కూడా ముఖ్య పాత్ర పోషించాడని, కీలక సన్నివేశాలలో బ్యాగ్రౌండ్ మ్యూజిక్ పరమ వీక్ గా ఇచ్చాడని, దేవర సినిమాకు కూడా ఇలాంటి బ్యాగ్రౌండ్ ఇస్తే తమ హీరో సినిమా అంటే సంగతులు అని సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు తారక్ ఫ్యాన్స్. అటు శంకర్ గేమ్ ఛేంజర్ కు, ఇటు అనిరుధ్ దేవరకు ది బెస్ట్ ఇచ్చి తీరాలి. RRR లాంటి భారీ విజయం తర్వాత రాబోతున్న ఈ రెండు సినిమాలు ఈ టాలీవుడ్ టాప్ హీరోలకు చాల కీలకం. ఈ దర్శకుడు మరియు సంగీత దర్శకుడు ఎటు వంటి కంబ్యాక్ ఇస్తారో చూడాలి.

 

 

Also Read: Mokshagna : నందమూరి వారసుడి ఎంట్రీ ఇక లాంఛనమే..!

 

Show comments