NTR Neel: యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్‌ డేకి ప్రశాంత్ నీల్ గిఫ్ట్ రెడీ.. ఇక రచ్చ రచ్చే!

Tollywood (1)

Tollywood (1)

NTR Neel: యంగ్ టైగర్ ఎన్టీఆర్ – సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో ఒక క్రేజీ ప్రాజెక్ట్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ అత్యంత భారీ చిత్రంపై అనౌన్స్‌మెంట్ వచ్చినప్పటి నుంచి అభిమానుల్లో, ట్రేడ్ వర్గాల్లో అంచనాలు భారీ స్థాయిలో నెలకొన్నాయి. ‘కేజీఎఫ్’, ‘సలార్’ వంటి చిత్రాలతో మాస్ పల్స్ పట్టుకున్న నీల్, ఈ సినిమాలో ఎన్టీఆర్‌ను ఏ రేంజ్‌లో చూపిస్తారు అనే ఆసక్తి తారక్ ఫ్యాన్స్‌తో పాటు సగటు సినిమా అభిమానుల్లో కనిపిస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక సాలిడ్ అప్‌డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

తాజాగా #NTRNeel నుంచి క్రేజీ అప్‌డేట్ వచ్చింది. సోషల్ మీడియాలో ఈ చిత్రానికి సంబంధించిన కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పోస్టర్ ఇప్పుడు ఫిల్మ్ నగర్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా రిలీజ్ చేసిన ఈ పోస్టర్‌లో ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ సముద్ర తీరాన నిలబడి ఉన్న పవర్‌ఫుల్ ఇమేజ్‌ను షేర్ చేశారు. అయితే ఇందులో అందరినీ ఆకర్షించింది మాత్రం సినిమా ట్యాగ్‌లైన్. గతంలో “You know the business and I know the chemistry” అని ఉన్న వాక్యాన్ని మార్చి, ఇప్పుడు “You know the vision.. and I know the storm” (నీకు విజన్ తెలుసు.. నాకు తుఫాను తెలుసు) అనే కొత్త ఫ్రేజ్‌ను జోడించారు. ఈ మార్పు సినిమాలోని ఇంటెన్సిటీని తెలియజేస్తోంది. ఎన్టీఆర్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మే 20 (తారక్ పుట్టినరోజు) నాడు ఈ చిత్రానికి సంబంధించిన భారీ అప్‌డేట్స్ రానున్నాయి. ఆ రోజున సినిమా టైటిల్‌తో పాటు ఫస్ట్ గ్లింప్స్‌ను కూడా విడుదల చేయనున్నట్లు సమాచారం. మైత్రీ మూవీ మేకర్స్ – ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం జూన్ 11, 2027న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ప్రశాంత్ నీల్ మార్క్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో కన్నడ బ్యూటీ రుక్మిణి వాసంత్ హీరోయిన్‌గా నటిస్తుండగా, ‘కేజీఎఫ్’ ఫేమ్ రవి బస్రూర్ సంగీతాన్ని అందిస్తున్నారు.