NTV Telugu Site icon

Jr NTR: కబీర్ vs వీరేంద్ర రఘునాథ్.. ఎన్టీఆర్ ప్లాన్ పెద్దదే!

Ntr Leaked Pic

Ntr Leaked Pic

దేవర అనే సినిమాతో ఒక సాలిడ్ హిట్ అందుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్. ఆయన ప్రస్తుతం వార్ అనే సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కుతున్న వార్ 2 అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో హృతిక్ రోషన్ హీరోగా నటిస్తుండగా ఆయనను ఢీకొట్టే పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ నటించబోతున్నట్లు తెలుస్తోంది. అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాని యష్ రాజ్ ఫిలిమ్స్ సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ వీరేంద్ర రఘునాథ్ అనే ఒక పాత్రలో నటించబోతున్నాడని తెలుస్తోంది. ఇక ఈ వీరేంద్ర రఘునాథ్ సౌత్ ఇండియా నుంచి వచ్చి రీసెర్చ్ అనాలసిస్ వింగ్ లో జాయిన్ అయిన ఒక వ్యక్తిగా కనిపించబోతున్నారు.

Thandel: తండేల్ కోసం చైతూ రెండు సినిమాల కష్టం.. కానీ?

అయితే అదే ‘రా’లో ఉన్న కొందరు తనను మోసం చేశారని భావించి మొత్తం ‘రా’కే ఎదురు తిరుగుతాడు. ఈ నేపథ్యంలో హృతిక్ రోషన్ తో ఢీ కొట్టాల్సి వచ్చిన పరిస్థితుల్లో ఏం జరిగింది అనే అంశాలను ఆధారంగా చేసుకుని ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా ద్వారా జూనియర్ ఎన్టీఆర్ మొట్టమొదటిసారిగా బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు.. ఇప్పటి వరకు ఆయన చేసిన పలు సినిమాలు హిందీలో రిలీజ్ అయ్యాయి కానీ నేరుగా హిందీ సినిమా చేయడం ఇదే మొదటి సారి.. ఈమధ్య కాలంలో ఆయన ఎక్కువగా బాంబే వెళ్లి వార్ 2 సినిమా షూటింగ్లో కూడా పాల్గొంటున్నారు..