NTV Telugu Site icon

Jr.NTR : నందమూరి నాలుగవ తరం నటుడి ఫస్ట్ లుక్ వచ్చేసింది..

Yvs

Yvs

వైవీఎస్ చౌదరి నటరత్న నందమూరి తారక రామారావు స్పూర్తితోనే చిత్రసీమలో అడుగుపెట్టారు. ” శ్రీ సీతారాముల కళ్యాణం చూతము రారండి ”తో తొలిసారి దర్శకుడిగా మారారు . తర్వాత సీతారామరాజు, యువరాజు, లాహిరి లాహిరి లాహిరిలో, సీతయ్య, టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్, దేవదాసు, ఒక్క మగాడు, సలీం, రేయ్ సినిమాలకు దర్శకత్వం వహించారు. తన సినీ కెరీర్ లో ఎందరో హీరోలను టాలీవుడ్ కు పరిచయం చేసాడు వైవీఎస్ చౌదరి. వెంకట్, సాయి ధరమ్ తేజ్, ఇలియానా, రామ్ పోతినేని వీరందరిని హీరోలుగా హీరోయిన్స్ గా తెలుగు తెరకు పరిచయం చేసారు.

Also Read : suriya : ‘కంగువ’ నుంచి ‘నాయకా’ .. లిరికల్ సాంగ్ రిలీజ్

సాయి ధరమ్ హీరోగా వచ్చిన రేయ్ ప్లాప్ తర్వాత దర్శకత్వానికి దూరంగా ఉన్నారు వైవీఎస్ చౌదరి. లాంగ్ గ్యాప్ తర్వాత మరో సినిమాను ప్రకటించాడు చౌదరి. నందమూరి నాలుగవ తరం నటవారసుడిగా జూనియర్ ఎన్టీఆర్ అన్న స్వర్గీయ జానకిరామ్ కుమారుడు నందమూరి తారక రామారావు ను హీరోగా టాలీవుడ్ కు పరిచయం చేస్తున్నాడు. చిత్ర ఎన్టీఆర్ తొలి దర్శనం అక్టోబర్ 30న ఉంటుందని గతంలో ప్రకటించిన చౌదరి, ఈ సినిమా నందమూరి అభిమానులకు కనుల పండుగగా ఉండబోతుందని ప్రకటించారు. తాజాగా ఎన్టీఆర్ లుక్ ను రివీల్ చేస్తూ వీడియో ట్ రిలీజ్ చేసాడు చౌదరి. పవర్ ఫుల్ లుక్స్ తో, బేస్ వాయిస్ తో చూడగానే ఆకట్టుకునే  లుక్ లో దర్శనం ఇచ్చాడు చిన్న ఎన్టీఆర్. 19 ఏళ్లు అమెరికాలో యాక్టింగ్ లో మాస్టర్స్ చేసి, అన్ని కళలలో ప్రావిణ్యం సాధించి, కుటుంబ సభ్యుల సపోర్ట్ తో, ముత్తాత రామారావు అశీసులతో వైవీఎస్ చౌదరి దర్శకత్వంలో వెండితెరకు పరిచయం కాబోతున్నాడు. ఆల్ ది బెస్ట్ ఎన్టీఆర్.