ఈరోజు స్టార్ డైరెక్టర్ కొరటాల శివ బర్త్ డే. ఆయన పుట్టినరోజు సందర్భంగా పలువురు ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. తాజాగా కొరటాలకు బర్త్ డే విషెస్ తెలుపుతూ ఎన్టీఆర్ ఎమోషనల్ ట్వీట్ చేశారు. “స్నేహానికి విలువ ఇచ్చే వ్యక్తిత్వం అరుదు. అటువంటి అరుదైన స్నేహితుడు, సన్నిహితుడు అయిన కొరటాల శివ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు” అంటూ కొరటాలను మనస్ఫూర్తిగా విష్ చేశారు ఎన్టీఆర్. ఇక ఎన్టీఆర్, కొరటాల కాంబినేషన్ లో “ఎన్టీఆర్ 30” రూపొందనున్న విషయం తెలిసిందే. వీరి కాంబినేషన్ లో తెరకెక్కనున్న రెండవ సినిమా ఇది. ముందుగా ఎన్టీఆర్ హీరోగా కొరటాల దర్శకత్వంలో “జనతా గ్యారేజ్” వచ్చింది. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం సూపర్ హిట్ అయ్యింది. ప్రస్తుతం ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో “ఆర్ఆర్ఆర్” చిత్రంలో నటిస్తున్నారు. ఇది పూర్తవ్వగానే కొరటాల ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది.
కొరటాల గురించి ఎన్టీఆర్ ఎమోషనల్ ట్వీట్
