Site icon NTV Telugu

Movie PressMeet : టంగ్ స్లిప్ అవుతున్న జర్నలిస్టులు.. ప్రెస్ మీట్ లో హీరోయిన్ కు చేదు అనుభవం

Kollywood

Kollywood

ఓ సినిమా కోసం 24 క్రాఫ్ట్స్ ఎంతో కష్టపడుతుంటాయి. ప్రేక్షకులు తమ సినిమాను ఆదరించాలని ప్రతి బొమ్మ కోరుకుంటుంది. సినిమాను జనాల్లోకి తీసుకెళ్లేందుకు ప్రమోషన్లను నిర్వహిస్తుంటారు మేకర్స్. కానీ ఈ ప్రమోషన్లు ఇప్పుడు బాడీ షేమింగ్ కేంద్రాలుగా మారాయి. సినిమా కన్నా.. పర్సనల్ ఎటాక్స్ చేస్తున్నారు రిపోర్టర్స్. రీసెంట్లీ డ్యూడ్ ప్రమోషన్లలో భాగంగా ప్రదీప్ రంగనాథన్ ను ఓ లేడీ రిపోర్టర్… మీరు హీరో మెటీరియల్ కాదంటూ ప్రశ్నించడం పెద్ద కాంట్రవర్సీకి దారి తీసింది. తాను కాదు తన సినిమా సమాధానం చెబుతుందన్నకున్న హీరోకు టాలీవుడ్ ప్రేక్షకులు అండగా నిలిచి.. అతడు హీరో మెటీరియల్ అని ఫ్రూవ్ చేశారు.

Also Read : Jana Nayagan : తమిళనాడునీ ఊపేస్తున్న ఇళయదళపతి విజయ్ కచేరి..

సిద్దు జొన్నలగడ్డ తెలుసు కదా ప్రమోషన్లలో భాగంగా ఇటువంటి చేదు అనుభవాన్నే ఎదుర్కొన్నాడు. మీరు రియల్ లైఫ్ లో ఉమనైజరా అంటూ లేడీ రిపోర్టరే క్వశ్చన్ చేయగా.. ఇది నా సినిమా గురించి ఇంటర్వ్యూనా లేక పర్సనల్ ఇంటర్వ్యూనా అంటూ స్ట్రాంగ్ రిప్లై ఇచ్చాడు టిల్లు.  96లో చిన్ననాటి త్రిష క్యారెక్టర్ చేసి పాపులరైన హీరోయిన్ గౌరీ కిషన్ రీసెంట్ ఇంటర్వ్యూలో బాడీ షేమింగ్ క్వశ్చన్ ఎదురైంది. ఆమె నటిస్తున్న అదర్స్ ప్రమోషన్లలో భాగంగా ప్రెస్ మీట్ నిర్వహించగా ఓ యూట్యూబర్ మీ వెయిట్ ఎంత అని  గౌరీ కిషన్ ను అడగటంతో స్ట్రాంగ్ రిప్లై ఇచ్చింది. తన బరువు గురించి కాదు ప్రతిభ గురించి మాట్లాడండి అంటూ సమాధానమిచ్చింది. గౌరీ కిషన్ పై రిపోర్టర్ చేసిన వ్యాఖ్యలపై తమిళ, మలయాళ సినీ సెలబ్రిటీలు ఆమెకు అండగా నిలుస్తున్నారు. మైక్ ఉంటే నోటికి ఏదీ పడితే ఆ ప్రశ్న అడగడం కూడా కరెక్ట్ కాదని అంటున్నారు సినిమా సెలబ్రిటీలు.

Exit mobile version