NTV Telugu Site icon

VishwakSen : శ్రీరాములు థియేటర్ కు మాస్ కా దాస్

Mekanic

Mekanic

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా మెకానిక్ రాకీ అనే సినిమా రానుంది. విశ్వక్ సేన్ సరసన మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ మాస్ యాక్షన్ మరియు కామెడీ ఎంటర్‌టైనర్‌ను నూతన దర్శకుడు రవితేజ ముళ్లపూడి దర్శకత్వం వహించనున్నాడు. SRT ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై ప్రముఖ నిర్మాత రామ్ తాళ్లూరి నిర్మించారు. ‘మెకానిక్ రాకి’ ఫస్ట్ గేర్ కు సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్‌ని ఆ మధ్య రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ అందుకుంది.

Also Read :  SK 30 : సంక్రాంతికి తగ్గేదేలేదంటున్న యంగ్ హీరో..

విశ్వక్ సేన్, మీనాక్షి చౌదరి మరియు శ్రద్ధా శ్రీనాథ్ మధ్య ట్రయాంగిల్ లవ్ నేపథ్యంలో మెకానిక్ రాకి రానుంది. కాగా ఈ చిత్ర ట్రైలర్ 1.O ను నేడు రిలిజ్ చేయనున్నారు మేకర్స్. అందుకోసం హైదరాబాద్ ముసా పెట్ లోని శ్రీరాములు థియేటర్ లో మధ్యాహ్నం 3:00 గంటలకు భారీ ఈవెంట్ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి చిత్ర హీరో విశ్వక్ సేన్ తో పాటు యూనిట్ హాజరుకానున్నారు. మెకానిక్ రాకీ దీపావళి కానుకగా అక్టోబర్ 31న వరల్డ్ వైడ్ గా థియేటర్లలో విడుదల చేయనున్నట్టు ఫస్ట్ గ్లిమ్స్ రిలీజ్ టైమ్ లో ప్రకటించిన మేకర్స్ వాయిదా వేశారు. షూటింగ్ డిలే కారణంగా దీపావళి రిలీజ్ పోస్ట్ ఫోన్ చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికి ఈ సినిమా నుండి రిలీజైన రెండు లిరికల్ సాంగ్స్ కు మంచి రెస్సాన్స్ వచ్చింది. ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ తో కంటిన్యూ ప్రమోషన్స్ చేస్తూ త్వరలో మరొక ట్రైలర్ రిలీజ్  చేసి నవంబరు 22 న గ్రాండ్ రిలీజ్ చేయనున్నారు మేకర్స్.

Show comments