Site icon NTV Telugu

Johnny Master : జానీ మాస్టర్ పై నమోదైన ఎఫ్ఐఆర్ లో కీలక విషయాలు..

Untitled Design (34)

Untitled Design (34)

తెలుగు, తమిళ్ ఇండస్ట్రీలో బాగా పాపులర్ అయిన కొరియోగ్రాఫర్ జాని మాస్టర్ గత కొంతకాలంగా తన మీద లైంగిక వేదింపులకు పాల్పడుతున్నట్లు మరో మహిళా కొరియోగ్రాఫర్ (21) పోలీసులకు ఫిర్యాదు చేసింది. అవుట్‌డోర్ చేస్తున్నప్పుడు మరియు నార్సింగిలోని తన నివాసంలో కూడా జానీ తనపై అనేకసార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఫిర్యాదులో పేర్కొంది. ఈ మేరకు నార్సింగి పోలీసుల ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసారు జానీ మాస్టర్ పై నమోదైన ఎఫ్ఐఆర్ లో కీలక విషయాలు పొందుపరిచారు పోలీసులు.

Also Read :  Johnny Master : ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల కేసు..

2017 లో ప్రముఖ చానల్ లో ప్రసారం అయిన ఢీ డాన్స్ షోలో జానీ మాస్టర్ కు పరిచయమైన యువతి, ఆ తర్వాత జానీ మాస్టర్ టీంలో జాయిన్ అయింది. ఆ తర్వాత టీమ్ నుండి తప్పుకుని జానీకి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా ఉండాలంటూ యువతికి ఫోన్ కాల్ రావడంతో 2019లో జానీ మాస్టర్ టీం లో అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా జాయిన్ అయింది సదరు యువతి. ఈ నేపథ్యంలో ఓ షో కోసం జానీ మాస్టర్ తో పాటు మరో ఇద్దరితో కలిసి ముంబైకి వెళ్ళిన యువతిపై ముంబైలోని ఓ హోటల్లో అత్యాచారానికి పాల్పడ్డ జానీ మాస్టర్, ఈ విషయాన్ని బయటికి ఎవరికీ చెప్పవద్దు అంటూ బెదిరించాడు, అదే మాదిరిగా షూటింగ్లో సమయంలో అతను చెప్పినట్లుగా వినకపోతే అసభ్యంగా ప్రవర్తించేవాడు, తరచూ జానీ మాస్టర్ అసభ్య ప్రవర్తించేవాడు, లైంగికంగా వేధించేవాడు, మతం మార్చుకొని తనని పెళ్లి చేసుకోవాలంటూ బలవంతం చేసాడని జానీ మాస్టర్ పై పోలీసులకు ఫిర్యాదు చేసిన యువతి.

 

Exit mobile version