Site icon NTV Telugu

Dharma Mahesh : జిస్మత్ మరో బ్రాంచ్ ప్రారంభించిన ధర్మ మహేష్

Jismat

Jismat

సినీ నటుడు మరియు రెస్టారెంట్ అధినేత ధర్మ మహేష్ ఆహార రంగంలో మరో ముందడుగు వేశారు. హైదరాబాద్‌లోని చైతన్యపురిలో తమ రెండవ బ్రాంచ్‌ను ప్రారంభించిన సందర్భంగా, ఆయన తమ బ్రాండ్‌ను ‘గిస్మత్ మండీ’ (Gismat Mandi) నుండి ‘జిస్మత్ మండీ’ (Jismat Mandi) గా రీబ్రాండింగ్ చేసినట్లు ప్రకటించారు. భోజన ప్రియులకు నాణ్యతతో కూడిన, నోరూరించే వంటకాలను అందుబాటులోకి తీసుకురావడం తమ లక్ష్యమని ఆయన వెల్లడించారు. ధర్మ మహేష్ మాట్లాడుతూ, తమ కుమారుడు జగద్వాజ పై ఉన్న ప్రేమతోనే ఈ పేరు మార్పు చేసినట్లు తెలిపారు. ‘Gismat’ నుంచి ‘Jismat’ గా మారిన ఈ పరివర్తన నాణ్యత, భావోద్వేగం మరియు వారసత్వం ద్వారా ప్రేరణ పొందిన కొత్త దశను సూచిస్తుందని ఆయన అన్నారు. ఈ రీబ్రాండింగ్ వెనుక ఉన్న భావోద్వేగ కారణాన్ని ధర్మ మహేష్ వివరించారు.

నేను కంపెనీ యాజమాన్యాన్ని నా కుమారుడు జగద్వజకు అంకితం చేస్తున్నాను. ఆ పరివర్తన పూర్తయ్యే వరకు, నేను కార్యకలాపాలు, విస్తరణను పర్యవేక్షిస్తున్నాను అన్నారు. ఇక్కడ ప్రతి బిర్యానీ ప్లేట్, మా అతిథులకి చిరునవ్వు, ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. మేము అందించే రుచి, నాణ్యత, ఆప్యాయత ఈ కొత్త గుర్తింపు కింద మరింత బలంగా పెరుగుతాయి. ఈ కొత్త పరిణామం రాబోయే దశాబ్దాల పాటు బ్రాండ్‌ను మరింత బలోపేతం చేస్తుందని ధర్మ మహేష్ విశ్వాసం వ్యక్తం చేశారు.

Exit mobile version