Site icon NTV Telugu

JINN Trailer : భయపెడుతున్న ‘జిన్’ ట్రైలర్

Jinn A

Jinn A

సాదలమ్మ ఫిల్మ్ ప్రొడక్షన్స్, బిల్వ స్టూడియోస్ బ్యానర్‌ల మీద నిఖిల్ ఎం. గౌడ నిర్మించిన తాజా హారర్ థ్రిల్లర్ చిత్రం ‘జిన్’. ఈ సినిమాకు చిన్మయ్ రామ్ దర్శకత్వం వహించారు. అమ్మిత్ రావ్, పర్వేజ్ సింబా, ప్రకాష్ తుమినాద్, రవి భట్, సంగీత వంటి నటీనటులు ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రం డిసెంబర్ 19న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో, సోమవారం నాడు చిత్ర బృందం ‘జిన్’ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌ను నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి, దర్శకుడు వీరభద్రం చౌదరి, నటుడు సోహెల్ వంటి సినీ ప్రముఖులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

Also Read :Vishnu Vinyasam: విష్ణు విన్యాసం చేయనున్న శ్రీవిష్ణు

భూతనాల చెరువు నేపథ్యం ఏంటి? కాలేజ్‌లో దాగి వున్న మిస్టరీ ఏంటి? అనే ఆసక్తికర ప్రశ్నలు రేకెత్తించేలా చిత్ర ట్రైలర్‌ను కట్ చేశారు. నలుగురు యువకులు ప్రేతాత్మలకు చిక్కడం, ఆ కాలేజీ భవనం నుంచి వారు బయటకు రాలేకపోవడం, మధ్యలో జిన్ రాక వంటి అంశాలతో ట్రైలర్‌ను ఆద్యంతం ఆసక్తికరంగా రూపొందించారు. కేవలం ట్రైలర్‌తోనే ప్రేక్షకులను భయపెట్టించడంలో మేకర్స్ సక్సెస్ అయ్యారు. ఇందులోని విజువల్స్, నేపథ్య సంగీతం (RR) ప్రేక్షకులను కట్టిపడేసేలా ఉన్నాయి. 19న విడుదల కానున్న ఈ ‘జిన్’ చిత్రం ప్రేక్షకులను ఏ స్థాయిలో భయపెడుతుందో చూడాలి.

Exit mobile version