సాధారణంగా మాలీవుడ్ హీరోలు తెలిసినంతగా.. ఫిల్మ్ మేకర్స్ గురించి పెద్దగా అవగాహన ఉండదు. కానీ జీతూ జోసెఫ్ డిఫరెంట్. ఆయన నుంచి సినిమాలు వస్తున్నాయంటే.. కేరళ ప్రేక్షకులే కాదు.. సౌత్ మొత్తం ఈగర్లీ వెయిట్ చేస్తుంది. ఇక అందులో క్రైమ్ థ్రిల్లర్, మిస్టరీ చిత్రాలైతే.. ఎప్పుడెప్పుడు చూస్తామన్న క్యూరియాసిటీతో ఉంటారు. అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ దృశ్యం 3. దృశ్యం సిరీస్ నుంచి థర్డ్ వెంచర్ రాబోతుందంటూ ఎనౌన్స్ చేశారో లేదో.. మోస్ట్ యాంటిసిపేటెడ్ చిత్రాల్లోకి చేరిపోయింది ఈ ప్రాజెక్టు.
Bromance : సోనీ లివ్‌లో మే 1 నుంచి ‘బ్రొమాన్స్’
దృశ్యం 3 సెట్స్‌పైకి వెళ్లకుండానే.. నెక్స్ట్ మూవీని ఎనౌన్స్ చేసి సడెన్ షాక్ ఇచ్చాడు జీతూ జోసెఫ్. రీసెంట్‌గా వలతు వశతే కల్లన్ ప్రాజెక్టును ప్రకటించాడు. బిజు మీనన్, జోజు జార్జ్‌లతో సినిమా తీయబోతున్నాడు. టైటిల్ పోస్టర్‌లో పోలీస్ కేస్ ఫైల్ కనిపించడంతో.. ఇదొక క్రైమ్ థ్రిల్లరని ఫిక్స్ అయిపోతున్నారు ఆడియన్స్. ఇదిలా ఉంటే.. ఇప్పుడు దృశ్యం 3 షూటింగ్ స్టార్ట్ అవుతుందా లేదా అన్న అనుమానాలు స్టార్ట్ అయ్యాయి. అయితే దృశ్యం సిరీస్ కోసం గ్రౌండ్ వర్క్ చేశాడు ఫిల్మ్ మేకర్. అయితే మోహన్‌లాల్‌కు ఉన్న కమిట్‌మెంట్స్ వల్ల దృశ్యం 3 ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పట్లో ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లదని టాక్. దీంతో.. మరో టూ ఫిల్మ్స్ ఫ్యూచర్ కూడా ఇప్పుడు డిస్కషన్ జరుగుతోంది.
నునక్కుజి తర్వాత జీతూ జోసెఫ్ డైరెక్ట్ చేస్తోన్న మూవీ రామ్. నేరు తర్వాత మోహన్‌లాల్-జీతూ కాంబోలో మూవీ కావడంతో విపరీతమైన ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ బొమ్మను రెండు పార్టులుగా తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు. 2020లోనే స్టార్ట్ అయినప్పటికీ.. కోవిడ్, ఇతర కారణాలతో షూటింగ్ డిలే అవుతుంది. అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా రూపుదిద్దుకుంటోంది. ఇంకా షూటింగ్ జరుపుకుంటూనే ఉందని టాక్. అలాగే ఆసిఫ్ అలీ, అపర్ణ బాలమురళి జంటగా నటిస్తోన్న మిరాజ్ షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. ఇక అఫీషియల్ రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేయడమే తరువాయి. ఇక కొలిక్కి తీసుకురావాల్సింది మోహన్‌లాల్‌తో తెరకెక్కిస్తున్న చిత్రాలే.
