Bromance : సోనీ లివ్‌లో మే 1 నుంచి ‘బ్రొమాన్స్’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇటీవల థియేటర్లలో విడుదలై ప్రేక్షకుల మనసు గెలుచుకున్న హాస్యభరిత చిత్రం ‘బ్రొమాన్స్’ ఇప్పుడు సోనీ లివ్‌లో మే 1 నుంచి స్ట్రీమింగ్ కానుంది. హాస్యం, యాక్షన్, డ్రామా, స్నేహ బంధం, హృదయాన్ని హత్తుకునే భావోద్వేగ సన్నివేశాలతో రూపొందిన ఈ మలయాళ చిత్రం థియేటర్లలో చూడలేనివారికి ఇంట్లోనే అద్భుత అనుభవాన్ని అందిస్తుంది.
Vasishta : ఇలాంటి కథ ఎక్కడా వినలేదు.. క్యారెక్టరే హీరో!
Also Read
చిత్ర దర్శకుడు అరుణ్ డి.జోస్ మాట్లాడుతూ, “‘బ్రొమాన్స్’ను థియేటర్లలో ఆదరించిన ప్రేక్షకులకు ఎప్పటికీ రుణపడి ఉంటాం. ఇది స్నేహ బంధంపై హృదయాన్ని హత్తుకునే కథ. డ్రామా, సస్పెన్స్, ట్విస్టులతో సినిమా అందరినీ ఆకట్టుకుంది. కనిపించకుండా పోయిన స్నేహితుడి కోసం వెతుక్కునే కథ ఇది. మే 1 నుంచి సోనీ లివ్‌లో స్ట్రీమింగ్ కాబోతుండటం ఆనందంగా ఉంది. ఈ చిత్రం మరిన్ని హృదయాలను గెలుచుకుంటుందని నమ్ముతున్నాం,” అన్నారు.
అరుణ్ డి.జోస్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘బ్రొమాన్స్’ కథ బింటో అనే యువకుడి దృక్కోణంలో సాగుతుంది. అతను తన సోదరుడి స్నేహితులతో కలిసి కనిపించకుండా పోయిన సోదరుడిని వెతుక్కుంటాడు. ఒకే రాత్రిలో జరిగే ఈ కథ ఊహించని ట్విస్టులు, మరచిపోలేని క్షణాలతో నిండిన ప్రయాణంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అరుణ్ డి.జోస్, రవీష్ నాథ్, థామస్ పి.సెబాస్టియన్ రాసిన ఈ కథను అషిక్ ఉస్మాన్ నిర్మించారు. అర్జున్ అశోకన్, భరత్ బోపన్న, శ్యామ్ మోహన్, మహిమ నంబియార్, మాథ్యూ థామస్, కలభవన్ షాజోన్ వంటి ప్రతిభావంతులైన నటులు ఈ చిత్రంలో నటించారు.
తాజావార్తలు
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!