Jayanth and Jingo Pen : “చిల్డ్రెన్స్ డే పేరుతో అడ్డదారి ప్రమోషన్లు వద్దు.. మా సినిమానే అసలైన కానుక!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలల దినోత్సవం (నవంబర్ 14) వేళ బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పోరుకు తెరలేచింది. పిల్లల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ‘జయంత్ అండ్ ది జింగో పెన్’ చిత్రం రేపు (నవంబర్ 14) థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమైంది. అయితే, ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్లో చిత్రయూనిట్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. చిల్డ్రెన్స్ డే పేరుతో కొందరు కావాలనే తమ సినిమాలను ప్రమోట్ చేసుకుంటూ ప్రేక్షకులను తప్పుదోవ పట్టిస్తున్నారంటూ దర్శకనిర్మాతలు పరోక్షంగా విసుర్లు విసరడం సంచలనం రేపుతోంది.
ప్రస్తుతం మార్కెట్లో కొన్ని సినిమాలు ఉన్నట్టుండి ‘చిల్డ్రెన్స్ డే స్పెషల్’ అంటూ ప్రచారం చేసుకోవడంపై ‘జయంత్ అండ్ ది జింగో పెన్’ దర్శకుడు నవీన్ దేశబోయిన, సహ నిర్మాత షఫి తీవ్రంగా స్పందించారు. “మేం కేవలం రిలీజ్ టైమ్ కోసం కాకుండా, మొదటి నుంచీ పిల్లలను దృష్టిలో పెట్టుకునే ఈ కథను తయారు చేసుకున్నాం. కానీ ఇప్పుడు కొందరు కావాలనే తమ చిత్రాలను బాలల దినోత్సవ ప్రత్యేక చిత్రాలుగా ప్రమోట్ చేసుకుంటున్నారు. ఆ ప్రచారాలు చూసి తల్లిదండ్రులు, పిల్లలు పొరబడొద్దు” అంటూ వారు కుండబద్దలు కొట్టారు.
Also Read
- Aakasam Lo Oka Tara: దుల్కర్ కోసం వస్తున్న మల్లు అర్జున్.. 'ఆకాశంలో ఒక తార'కు బన్నీ బూస్ట్!
- Dil Raju - Anil Ravipudi: ఇప్పుడే 2028 సంక్రాంతి కర్చీఫ్ వేసిన దిల్ రాజు.. ఆ డైరెక్టర్‌తోనే సినిమా!
- Mouli: దొంగ నా కొడుకు.. దొరికేశాడు
- Dil Raju : 'వారణాసి' రిలీజ్ ఓన్లీ నైజాం మాత్రమే చేస్తా.. తేల్చి చెప్పిన దిల్ రాజు!
సాధారణంగా సినిమా రిలీజ్ అవుతుందంటే టికెట్ రేట్లు పెంచే ఈ రోజుల్లో, ఈ చిత్ర నిర్మాత దివ్య ప్రవీణ్ బొలిశెట్టి ఒక సాహసోపేతమైన, అభినందనీయమైన నిర్ణయం తీసుకున్నారు. తమ సినిమాను కేవలం ఒక వ్యాపార వస్తువులా చూడటం లేదని స్పష్టం చేస్తూ.. పిల్లల కోసం రూ. 250 ఉన్న టికెట్ ధరను ఏకంగా రూ. 150కి తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయానికి అనూహ్య స్పందన లభిస్తోందని, ఇప్పటికే పలు పాఠశాలలు తమ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా థియేటర్లను బుక్ చేసుకోవడంతో షోలన్నీ హౌస్ ఫుల్ అవుతున్నాయని చిత్రబృందం ఆనందం వ్యక్తం చేసింది. నమో జయం ప్రొడక్షన్స్ బ్యానర్‌పై జాతీయ అవార్డు గ్రహీత నవీన్ దేశబోయిన దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో మాస్టర్ జయంత్ బొలిశెట్టి ప్రధాన పాత్ర పోషించగా, ఊహా రెడ్డి, సత్యం రాజేష్, తనికెళ్ల భరణి, ఆశిష్ గాంధీ, మానస రాధాకృష్ణన్, కాశీ విశ్వనాథ్ వంటి హేమాహేమీలు కీలక పాత్రల్లో నటించారు.
తాజావార్తలు
-
AP Govt: ఏపీకి పెట్టుబడుల వెల్లువ.. రూ.32.49 లక్షల కోట్ల మైలురాయి..
-
Cricketer Nandini : వికారాబాద్‌లో విషాదం.. బీసీసీఐ అండర్-19 క్రికెటర్ నందిని ఆత్మహత్య
-
Aakasam Lo Oka Tara: దుల్కర్ కోసం వస్తున్న మల్లు అర్జున్.. ‘ఆకాశంలో ఒక తార’కు బన్నీ బూస్ట్!
-
Indian Sailors: కరాచీ పోర్టులో చిక్కుకున్న ఆరుగురు భారతీయులు.. పాక్‌తో భారత్ సంప్రదింపులు!
-
Dil Raju – Anil Ravipudi: ఇప్పుడే 2028 సంక్రాంతి కర్చీఫ్ వేసిన దిల్ రాజు.. ఆ డైరెక్టర్‌తోనే సినిమా!
ట్రెండింగ్
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!
-
Matt Henry: భారత్‌ను మడతెట్టెస్తున్న మాట్ హెన్రీ.. ఇది మూడోసారి.. ఏకంగా 8 వికెట్స్!
-
NZ vs IND 4th ODI: భారత్ ఖాతాలో చెత్త రికార్డు.. పాకిస్థాన్ సరసన టీమిండియా!
-
India Playing XI 4th ODI: గిల్, రాహుల్, కాంబోజ్ అవుట్.. ఇషాన్ కిషన్, సిరాజ్ ఇన్.. కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్..!
-
ICC కీలక నిర్ణయాలపై ఉత్కంఠ.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో కీలక మార్పులు.. 12 జట్లతో ప్లాన్.?