Site icon NTV Telugu

SIGMA : జాసన్ సంజయ్ సిగ్మా.. షూటింగ్ ఫినిష్.. టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్

Sigma

Sigma

తమిళ స్టార్ హీరో విజయ్ కుమారుడు డైరెక్టర్ గా కోలీవుడ్ అరంగ్రేటం చేస్తున్న సంగతి తెలిసిందే. టోర్నడాలోని ఓ ఫిల్మ్ స్కూల్లో నేర్చుకున్న విద్య, గతంలో కొన్ని షార్ట్ ఫిల్మ్స్ చేసిన ఎక్స్ పీరియన్స్‌తో కోలీవుడ్ లో డైరెక్టర్ గా ఎంట్రీ ఇస్తున్నాడు. తన ఫస్ట్ సినిమాలో హీరోగా టాలీవుడ్ నటుడు సందీప్ కిషన్‌ తో SIGMA అనే  సినిమా చేస్తున్నాడు. ఆ మధ్య సందీప్ బర్త్ డే కానుకగా వచ్చిన ఈ సినిమా ఫస్ట్ లోక్ పోస్టర్ ఆకట్టుకుంది.

Also Read : MSVPG : చిరు ఫ్యాన్స్ తో దర్శకుడు అనిల్ రావిపూడి ఫ్రెండ్లీ మీట్

ఇక తన తండ్రి విజయ్ స్టార్ హీరో అయినప్పటికీ జాసన్ మాత్రం దర్శకుడిగా రాణించాలని దర్శకత్వంపైనే కాన్సట్రేషన్ చేస్తున్నాడు. అందుకు ఇప్పుడు తానూ చేస్తున్న సిగ్మా సినిమాపైనే తన ఫోకస్ పెట్టాడు జాసన్. తొలి సినిమాతో హిట్ కొట్టి దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకోవాలని చూస్తున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబందించి మరొక అప్డేట్ ఇచ్చారు మేకర్స్. గత కొంతకాలంగా షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా షూటింగ్ ను నేటితో ముగించారు. ఈ నేపధ్యంలో షూటింగ్  ముగిస్తున్నట్టు వీడియో రిలీజ్ చేసారు. ప్రస్తుతం డైరెక్షన్‌కే ఇంపార్టెన్స్ ఇస్తోన్న జానన్ సంజయ్ ఫ్యూచర్‌లో హీరో అవుతాడేమో చూడాలి. బడా చిత్రాల నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. తమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా ఫస్ట్ టీజర్ ను ఈ నెల 23న సాయంత్రం 5 గంటలకు రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్.

Exit mobile version