Site icon NTV Telugu

సీరియస్ గా వర్కౌట్లు చేస్తున్న కపూర్ సిస్టర్స్… కానీ నవ్వాగట్లేదుగా…!!

Janvi Kapoor shares funny video with sister Khushi Kapoor

సీరియస్ గా వర్కౌట్లు చేస్తున్నామంటూ దివంగత నటి శ్రీదేవి కూతుళ్ళు జాన్వీ కపూర్, ఖుషి కపూర్ షేర్ చేసిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది. కపూర్ సిస్టర్స్ షేర్ చేసిన ఈ ఫన్నీ వీడియోలో ఎరుపు, ఊదా రంగు జిమ్ దుస్తులు ధరించిన జాన్వి కపూర్ తన చెల్లెలు ఖుషీ కాళ్ళను పట్టుకుని లాగడం కనిపిస్తుంది. నేలమీద పడుకున్న ఖుషీ కపూర్, జాన్వి ఆమెను పట్టుకోవటానికి ప్రయత్నించినప్పుడు నవ్వుతోంది. ఖుషీ బూడిద రంగు టాప్, బ్లాక్ లెగ్గింగ్స్ ధరించింది. ‘సీరియస్ వర్కౌట్లు’ అంటూ తెగ నవ్వేస్తున్నారు కపూర్ సిస్టర్స్.

Read Also : చెన్నై చేరిన బుట్టబొమ్మ… పిక్స్ వైరల్

జాన్వీ పలు చిత్రాలతో బిజీగా ఉంది. జాన్వీ కపూర్ ఇటీవల తన తదుపరి చిత్రం ‘గుడ్ లక్ జెర్రీ’ షూటింగ్ లో పాల్గొంది. ఈ చిత్రం 2018లో వచ్చిన ‘కోలమవు కోకిలా’ అనే తమిళ చిత్రానికి హిందీ రీమేక్. దీపక్ డోబ్రియాల్, మీతా వశిష్ట్, నీరజ్ సూద్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ‘దోస్తానా 2’, కరణ్ జోహార్ ‘తఖ్త్’ లాంటి భారీ చిత్రాలు ఆమె ఖాతాలో ఉన్నాయి. కాగా ఈ ఏడాది జాన్వీ చెల్లెలు ఖుషీ కపూర్ వెండితెర అరంగ్రేటం చేయనుంది అనే వార్తలు వస్తున్నాయి. ఖుషీ కపూర్ ఇటీవల పలు బికినీ హాట్ పిక్స్ తో సోషల్ మీడియాలో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఆ తరువాత కూడా హాట్ ఫొటోలతో నెట్టింట్లో రచ్చ చేసింది ఖుషీ.

View this post on Instagram

A post shared by Janhvi Kapoor ??? (@janhvikapoor_queen)

Exit mobile version