NTV Telugu Site icon

Jani Master: భార్యతో బైక్ పై చక్కర్లు కొట్టిన జానీ మాస్టర్

Jani Master Wife On Bike

Jani Master Wife On Bike

Jani Master Roaming on Roads at his Native village kothuru with bike: టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఈ మధ్యనే జనసేన పార్టీలో చేరిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆయన ఎక్కువగా తన సొంత ఊరిలో ఉండేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. వాస్తవానికి ఈటీవీ ప్రారంభించిన ఢీ అల్టిమేట్ డాన్స్ షో ద్వారా ఆయన సినీ రంగానికి పరిచయమయ్యారు. ఆ తర్వాత ఆయనకు నితిన్ హీరోగా నటించిన ద్రోణ అనే సినిమాలో మూడు సాంగ్స్ కొరియోగ్రాఫ్ చేసే అవకాశం వచ్చింది. ఆ తర్వాత మర్యాద రామన్న సినిమాతో ఆయన పేరు కాస్త ఇండస్ట్రీ వర్గాల్లో బాగా వైరల్ అయింది. ఇక ఆ తర్వాత ఆయనకు వరుసగా ఈగ, రచ్చ, నాయక్, బాద్షా, ఇద్దరమ్మాయిలతో, ఎవడు, రేసుగుర్రం, గోవిందుడు అందరివాడేలే ఇలా స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు వచ్చాయి.

Sundaram Master: సుందరం మాస్టర్ వెనక్కి వెళ్ళాడు.. ఆ రోజే రిలీజ్

ఇక ఏకంగా తమిళనాడుకు కూడా వెళ్లి అక్కడ స్టార్ హీరోలతో కూడా డాన్స్ కొరియోగ్రాఫ్ చేసే స్థాయికి వెళ్లిపోయారు. ఇక కొన్నాళ్ల నుంచి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న ఆయన సడన్గా ఆంధ్రప్రదేశ్లో ప్రత్యక్షమై రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు ప్రకటించి షాక్ ఇచ్చారు. ఇక జగన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసిన ఆయన జనసేనలో చేరే అవకాశం ఉందని ముందు నుంచి ప్రచారం జరిగింది. అందుకు తగ్గట్టుగానే ఆయన పవన్ సమక్షంలో జనసేన కండువా కూడా కప్పుకున్నారు. ఇక ఇప్పుడు సోషల్ మీడియాలో తన భార్యతో కలిసి ఉన్న ఫోటోలు రెండు షేర్ చేశారు. తన చిన్నతనంలో ఉన్న కొత్తూరు గ్రామంలో తన భార్యతో కలిసి సరదాగా గడుపుతున్నానని తన చిన్నతనంలోని గోల్డెన్ డేస్ అన్నింటిని గుర్తుకు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నానని ఆయన చెప్పుకొచ్చారు.