NTV Telugu Site icon

Jani Master : జానీ మాస్టర్ కు కొరియోగ్రఫీ అవకాశం వచ్చిందా..?

Jani Master

Jani Master

లైంగిక ఆరోణలు నేపథ్యంలో అరెస్ట్ అయిన జానీ మాస్టర్ ఇటీవల బెయిల్ పై బయటకు వచ్చాడు. తన డాన్స్ తో నేషనల్ అవార్డు అందుకున్న జానీ మాస్టర్ నేడు సినిమా అవాకాశాలు లేక ఇబ్బదులు ఎదుర్కొంటున్నాడు. వాస్తవానికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పాన్ ఇండియా మోస్ట్ క్రేజీయెస్ట్ సినిమా పుష్ప -2లో జానీ మాస్టర్ స్పెషల్ సాంగ్ కు కొరియోగ్రాఫీ చేయాల్సి ఉంది. కానీ అరెస్ట్ నేపథ్యంలో ఆ అవకాశన్ని కోల్పోయాడు జానీ మాస్టర్.

Also Read : Release Clash : కన్నడ బాక్సాఫీస్ దగ్గర తలపడుతోన్న స్టార్ హీరోస్

కాగా ప్రస్తుతం బెయిల్ పై బయట ఉన్న జానీ మాస్టర్ కాళిగానే ఉన్నాడు.  అయితే జానీ మాస్టర్ కు ఎట్టకేలకు ఓ అవకాశం వచ్చినట్టు తెలుస్తోంది. అయితే అది మన టాలీవుడ్ లో కాదు. బాలీవుడ్ యంగ్ హీరోలలో స్టార్ క్యాపబుల్ ఉన్న హీరో వరుణ్ ధావన్. ఈ కుర్ర హీరో ఇప్పడు బేబీ జాన్ అనే సినిమాలో నటిస్తున్నాడు. తమిళ హీరో విజయ్ నటించిన తేరి సినిమాకు బేబీ జాన్ అఫీషియల్ రీమేక్. కీర్తి సురేష్ ఈ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. అయితే ఈ సినిమాలోని ఓ స్పెషల్ సాంగ్ కు కొరియోగ్రాఫర్ గా జానీ మాస్టర్ కు అవకాశం వచ్చిందట. వరుణ్ ధావన్ తో కలిసి డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్న జానీ మాస్టర్ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. భారీ బడ్జెట్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ SS థమన్ సంగీతం అందిస్తుండగా డిసెంబరు 25న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది.